Congress : 43 మంది కాంగ్రెస్ నాయకులకు అధిష్టానం నోటీసులు

బిహార్‌లో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పేలవ ప్రదర్శన తర్వాత కాంగ్రెస్ క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. ఎన్నికల సమయంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపిస్తూ 43 మంది నాయకులకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

New Update
congress

బిహార్‌లో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పేలవ ప్రదర్శన తర్వాత కాంగ్రెస్ క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. ఎన్నికల సమయంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపిస్తూ 43 మంది సీనియర్ నాయకులకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచార సమయంలో మీడియా వేదికలపై పార్టీ అధికారిక వైఖరికి భిన్నంగా ప్రకటనలు చేయడం ద్వారా పార్టీ ప్రతిష్ట, గౌరవం ఎన్నికల ఫలితాలపై ప్రతికూల ప్రభావం పడిందని కాంగ్రెస్ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ పేర్కొంది.

పార్టీలో క్రమశిక్షణ, ఐక్యత చాలా ముఖ్యమని, వాటిని దెబ్బతీసే చర్యలను తీవ్రంగా పరిగణిస్తామని కమిటీ స్పష్టం చేసింది. నోటీసులు అందుకున్న వారిలో పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు ఇతర సీనియర్ పార్టీ నాయకులు ఉన్నారు. వీరిలో ముఖ్యంగా మాజీ మంత్రి వీణా షాహి, ఏఐసీసీ సభ్యులు మధురేంద్ర కుమార్ సింగ్,  మాజీ ఎమ్మెల్సీ అజయ్ కుమార్ సింగ్, మాజీ మంత్రి ఆఫాక్ ఆలం, మాజీ ఎమ్మెల్యే సుధీర్ కుమార్ (బంటీ చౌదరి)లు ఉన్నారు. 

మధ్యాహ్నం 12 గంటల లోపు

కాంగ్రెస్ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు కపిల్ దేవ్ ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ, నోటీసులు అందుకున్న నాయకులందరూ నవంబర్ 21 మధ్యాహ్నం 12 గంటల లోపు తమ లిఖితపూర్వక వివరణను కమిటీకి సమర్పించాలని ఆదేశించారు. బిహార్ ఎన్నికల్లో కూటమి ఓటమి తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమశిక్షణా చర్యలు పార్టీలో అంతర్గత అసంతృప్తిని అణచివేయడానికి, నాయకత్వంపై పట్టు సాధించడానికి ఉద్దేశించినట్లుగా కనిపిస్తున్నాయి.

ప్రస్తుత ఎన్నికల్లో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రమే గెలవడంతో, గత నాలుగు ఎన్నికల్లో ఇదే కాంగ్రెస్ పార్టీకి అత్యంత పేలవమైన ప్రదర్శన. 2010లో 8 మంది ఎమ్మెల్యేలు,  2015లో 27 మంది ఎమ్మెల్యేలు, 2020లో 19 మంది ఎమ్మెల్యేలు, తాజా ఎన్నికల్లో 6 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. 

Advertisment
తాజా కథనాలు