బద్రినాథ్‌, కేదార్‌నాథ్‌ ఆలయాల్లో హిందుయేతరులపై నిషేధం

ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌ ఆలయాల పవిత్రతను కాపాడేందుకు బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ ఆలయాల్లోకి కేవలం హిందువులను మాత్రమే అనుమతించాలని కమిటీ ప్రాథమికంగా నిర్ణయించింది.

New Update
Non-Hindus banned

ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌ ఆలయాల పవిత్రతను కాపాడేందుకు బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ ఆలయాల్లోకి కేవలం హిందువులను మాత్రమే అనుమతించాలని కమిటీ ప్రాథమికంగా నిర్ణయించింది. ఆదివారం జరిగిన కీలక సమావేశంలో BKTC ఈ మేరకు ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌లతో పాటు గంగోత్రి, ముక్భా సహా BKTC పరిధిలోని అన్ని ఆలయాల్లో హిందూయేతరుల ప్రవేశంపై పూర్తిస్థాయిలో నిషేధం విధించాలని ఈ తీర్మానంలో ప్రతిపాదించారు. సనాతన ధర్మ సంప్రదాయాలను, ఆలయాల ఆధ్యాత్మికతను కాపాడటమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది.

ప్రస్తుతం ఆమోదించిన ఈ తీర్మానాన్ని త్వరలో జరగబోయే బోర్డు సమావేశంలో అధికారికంగా ప్రవేశపెట్టనున్నారు. అక్కడ బోర్డు ఆమోదం లభించిన తర్వాత, ఈ నిబంధన పూర్తిస్థాయిలో అమలులోకి రానుంది. ఈ ప్రతిపాదన అమలైతే, ఆలయాల ప్రవేశ ద్వారాల వద్ద భక్తుల ఐటెంటిటీని చెక్ చేసి లోనికి పంపే అవకాశం ఉంది. హిమాలయాల్లోని ఈ పుణ్యక్షేత్రాల చుట్టూ ఉన్న పర్యావరణం, ఆధ్యాత్మిక వాతావరణాన్ని పరిరక్షించాలని గత కొంతకాలంగా భక్తుల నుంచి, సాధువుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆలయ కమిటీ ఈ కఠిన నిర్ణయం వైపు మొగ్గు చూపింది. ఇది కేవలం పర్యాటక స్థలంగా కాకుండా, ఆధ్యాత్మిక కేంద్రంగానే ఉండాలని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం ఉత్తరాఖండ్‌లోని ఇతర ఆలయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు