/rtv/media/media_files/2025/04/03/aOCyRDpefNAnAHQjAjZZ.jpg)
Trump Tariffs Effect On India
అంతా సర్దుకుంటుంది..ఏం పర్లేదు అంటోంది భారత్. అమెరికా అదనపు సుంకాలపై భయపడాల్సింది ఏమీ లేదని చెబుతోంది. టారీఫ్ ల సమస్య పరిష్కారానికి ఇరు దేశాల మధ్య చర్చలకు ఇంకా మార్గాలు తెరిచే ఉన్నాయని చెబుతోంది భారత ప్రభుత్వం. దీనికి సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దాంతో పాటూ భారత్ ఇప్పుడు ఇతర దేశాలకూ ఎగుమతులను ప్రారంభించబోతోంది దీని వలన సుంకాల ప్రభావం అనుకున్నంత తీవ్ర స్థాయిలో ఉండకపోవచ్చని అంటోంది. ఎగుమతిదారులు ఆందోళన చెందాల్సి అవసర లేదని...ప్రభుత్వం అన్ని ఏర్పాట్లనూ చేస్తోందని చెబుతున్నారు. ఇరుదేశాల మధ్య దీర్ఘకాలిక సంబంధాల్లో ఇదొక తాత్కాలిక దశ మాత్రమేనని అన్నారు.
రెండు దేశాలు ఒక నిర్ణయానికి వస్తాయి...
అదనపు సుంకాల మీద అమెరికా, భారత్ రెండూ కలిపి ఒక నిర్ణయానికి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు యూఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్. ద్వైపాక్షిక సంబంధాలు చాలా క్లిష్టమైనవి...వాటిని వదులుకోవడానికి ఏ దేశం సిద్ధంగా ఉండదని అన్నారు. అయితే ఈ విషయంలో భారత్ కొంచెం ముందుకు రావాలని బెసెంట్ తెలిపారు. చర్చలకు ఆ దేశం సహకరించడం లేదని అన్నారు. అంతు ముందు భారత్ చర్చల కోసం వచ్చినప్పుడు తమకు కుదరలేదని..జూన్ నెలాఖరుకి ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకుంటాయని తాను భావించానని చెప్పుకొచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ట్రంప్ మధ్య ఉన్న బంధాన్ని ప్రస్తావిస్తూ బెసెంట్ మాట్లాడుతూ, "ఇది చాలా సంక్లిష్టమైన సంబంధం. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని, అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ...రెండూ కలిసి ఉండడమే ఎప్పటికైనా మంచిదని..తొందరలోనే ఇరు దేశాలూ కలిసి వస్తాయని బెసంట్ ఆశాభావం వ్యక్తం చేశారు. న్యూ ఢిల్లీ కూడా తమపై అత్యధిక సుంకాలను విధించిందని చెప్పారు. అందుకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని సమర్థించారు.
అలాగే భారత్ రూపాయి బలపడ్డాన్ని స్కాట్ బెసెంట్ తోసిపుచ్చారు. రూపాయి ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా మారదని ఆయన అన్నారు. దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. అంతకు ముందు రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేస్తూ భారత్ లాభాలు ఆర్జిస్తోందని బెసెంట్ ఆరోపించారు. మాస్కో నుండి రాయితీ ముడి చమురును కొనుగోలు చేసి, శుద్ధి చేసిన ఉత్పత్తులను తిరిగి విక్రయించే భారతదేశం యొక్క పద్ధతిని "ఆమోదయోగ్యం కాని" మధ్యవర్తిత్వం అన్నారు.
Also Read: Vinayaka Chavithi 2025: జైజై గణేశా..సెలబ్రిటీ వినాయకచవితి..అలరిస్తున్న ఫోటోలు