ఢిల్లీలో అది ఉంటేనే పెట్రోల్, డీజిల్.. లేకుంటే నడవాల్సిందే!!

ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా పొల్యూషన్ క్లియరెన్స్ సర్టిఫికేట్ లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

New Update
Pollution Certificate in Delhi

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. నేటి నుండి (గురువారం) అమలులోకి వచ్చేలా వాహనదారులపై కఠిన ఆంక్షలు విధించింది. ముఖ్యంగా పొల్యూషన్ క్లియరెన్స్ సర్టిఫికేట్ లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

కాలుష్య సర్టిఫికేట్ తప్పనిసరి

ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం, వాహనదారులు పెట్రోల్ లేదా డీజిల్ పోయించుకోవాలంటే ఖచ్చితంగా 'పొల్యూషన్ సర్టిఫికేట్' చూపించాల్సి ఉంటుంది. ప్రతి పెట్రోల్ బంకు వద్ద సిబ్బంది లేదా సెక్యూరిటీ వారు PUC సర్టిఫికేట్లను తనిఖీ చేస్తారు. సర్టిఫికేట్ లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే రూ.10,000 వరకు భారీ జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉందని రవాణా శాఖ హెచ్చరించింది.

పాత వాహనాలపై నిషేధం..

కాలుష్యం 'అత్యంత తీవ్ర' స్థాయికి చేరుకోవడంతో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఢిల్లీ వెలుపల నమోదైన పాత డీజిల్ వాహనాలు (ముఖ్యంగా BS-IV, అంతకంటే పాతవి) సిటీలోకి ప్రవేశించకుండా ఢిల్లీ సరిహద్దులోనే అడ్డుకుంటున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, ఢిల్లీలో 10 ఏళ్లు దాటిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలపై పూర్తి నిషేధం కొనసాగుతోంది. అటువంటి వాహనాలు రోడ్డుపై కనిపిస్తే వెంటనే సీజ్ చేసి స్క్రాపింగ్‌కు పంపిస్తామని అధికారులు తెలిపారు. అత్యవసర సేవలు అందించే వాహనాలు, పాలు, కూరగాయలు, మందులు మోసుకెళ్లే ట్రక్కులకు ఈ నిబంధనల నుండి మినహాయింపు ఇచ్చారు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాలు (EV), సి.ఎన్.జి (CNG) వాహనాలపై ఎటువంటి ఆంక్షలు లేవు.

Advertisment
తాజా కథనాలు