BIhar Elections 2025 : నాకు టికెట్ ఇచ్చే వరకు లేవను.. సీఎం ఇంటి ముందు ఎమ్మెల్యే నిరసన!

జేడీయూ (JDU) పార్టీ అధినేత, సీఎం నితీష్ కుమార్ నివాసం వద్ద ఇటీవల తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పార్టీలో టికెట్ల పంపిణీ విషయంలో అసంతృప్తి చెందిన నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆయన ఇంటి వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు.

New Update
bihar elections

బీహార్లో ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. జేడీయూ (JDU) పార్టీ అధినేత, సీఎం నితీష్ కుమార్ నివాసం వద్ద ఇటీవల తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పార్టీలో టికెట్ల పంపిణీ విషయంలో అసంతృప్తి చెందిన నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆయన ఇంటి వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిరసనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు సీఎం ఇంటి చుట్టూ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. నిరసనకారులు లోపలికి ప్రవేశించకుండా ఉండేందుకు సీఎం  నివాసం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని  మూసివేసి, పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. 

సీఎం నితీష్ కుమార్ ఇంటి వద్ద నిరసన

జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్ సీఎం నితీష్ కుమార్  ఇంటి వద్ద నిరసన చేపట్టారు. గోపాల్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికల టికెట్ పొందడానికి ముఖ్యమంత్రిని కలవాలని డిమాండ్ చేస్తూ మండల్ నితీష్ కుమార్ నివాసం వెలుపల కూర్చున్నారు. తనని సీఎం కలిసే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు. తనని కలిసి టికెట్ ఇస్తాననే హామీ ఇచ్చేవరకు కదలనని తేల్చి చెప్పారు. భద్రతా సిబ్బంది కోరుకుంటే లాఠీ ఛార్జ్ చేయవచ్చు అని కూడా అన్నారు. కుర్తా, నవీనగర్, దర్భంగా ప్రాంతాలకు చెందిన కార్యకర్తలు కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. ఇక భాగల్పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అజయ్ మండల్ సైతం అభ్యర్థుల ఎంపికపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తన పార్లమెంటరీ స్థానానికి రాజీనామా చేస్తూ నితీష్ కుమార్‌కు లేఖ సమర్పించారు. మొత్తంగా, అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలో టికెట్ల పంపిణీ కారణంగా తలెత్తిన ఈ అంతర్గత సంక్షోభం, నితీష్ కుమార్‌కు ఇప్పుడు కొత్త సవాలుగా మారింది. ఎన్నికల వేళ ఈ నిరసనలు పార్టీపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.

243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి.  నవంబర్ 6 మొదటి దశ, నవంబర్ 11 రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి.  ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరగనుంది. బీహార్ ఎన్నికలకు జేడియూ, బీజేపీ రెండూ సీట్ల పంపకాలను ఖరారు చేశాయి. ఒప్పందం ప్రకారం, 243 సీట్లకు గానూ  బీజేపీ, జేడియూ చెరో 101 చోట్లలో పోటీ చేస్తుంది. కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) 29 సీట్లలో పోటీ చేస్తుంది. రాజ్యసభ ఎంపీ ఉపేంద్ర కుష్వాహా నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ మోర్చా, హిందుస్థానీ అవామ్ మోర్చా (జితన్ రామ్ మాంఝీ)లకు ఒక్కొక్కరికి ఆరు సీట్లు కేటాయించారు.

ఇది కూడా చూడండి: Gold Rates: దీపావళి వేళ మహిళలకు బిగ్ షాక్.. రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు

Advertisment
తాజా కథనాలు