/rtv/media/media_files/2025/08/06/encounter-2025-08-06-09-29-17.jpg)
జార్ఖండ్‌లోని గుమ్లాలో బుధవాం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు పిఎల్‌ఎఫ్‌ఐ కమాండర్ మార్టిన్ కెర్కెట్టాను హతమార్చాయి. అతనిపై రూ. 15 లక్షల రివార్డు కూడా ఉంది. మార్టిన్ నుండి ఆయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎల్‌ఎఫ్‌ఐ) అనేది జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లా నివాసి దినేష్ గోప్ ఏర్పాటు చేసిన మిలిటెంట్ మావోయిస్టు సంస్థ . కామ్దారా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని చంగబరి ఉపర్టోలిలో పిఎల్‌ఎఫ్‌ఐ ఉగ్రవాదులు దాక్కున్నారని ఎస్పీ హారిస్ బిన్ జామాకు ముందుగా సమాచారం అందింది. వెంటనే ఆయన ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ఆపరేషన్ ప్రారంభించారు. ఆ తర్వాత పోలీసు బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుంది.
Gumla, Jharkhand: A top operative of the banned extremist outfit People's Liberation Front of India (PLFI), identified as Martin Kerketta, was killed in an encounter with police last night. He was carrying a reward of Rs 15 lakhs declared against him. Police teams received…
— ANI (@ANI) August 6, 2025
దినేష్ గోప్ అరెస్టు తర్వాత
పోలీసులను చూసిన ఉగ్రవాదులు వారిపై కాల్పులు ప్రారంభించారు. ప్రతీకారంగా పోలీసు బృందం కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో పిఎల్‌ఎఫ్‌ఐ ఉగ్రవాద సంస్థ కమాండర్ మార్టిన్ కెర్కెట్టా కాల్పుల్లో మరణించాడు. మార్టిన్ కెర్కెట్టా గుమ్లా జిల్లాలోని కామ్దారా ప్రాంతంలోని రెడ్మా గ్రామానికి చెందిన వ్యక్తి. ఆయన పిఎల్‌ఎఫ్‌ఐ కేంద్ర కమిటీ సభ్యుడు కూడా. పిఎల్‌ఎఫ్‌ఐ అధినేత దినేష్ గోప్ అరెస్టు తర్వాత, సంస్థ బాధ్యతలను మార్టిన్ కెర్కెట్టా స్వీకరించారు. మార్టిన్, దినేష్ గోప్ చిన్ననాటి స్నేహితులు ఇద్దరూ లాపుంగ్‌లోని మహుగావ్‌లో ఉన్న పాఠశాలలో కలిసి చదువుకున్నారు. తరువాత వారిద్దరూ కలిసి సంస్థను బలోపేతం చేసి అనేక సంఘటనలను నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం మార్టిన్ కెర్కెట్టాపై రూ. 15 లక్షల రివార్డును ప్రకటించింది. గుమ్లా పోలీసుల ఈ చర్య నక్సల్ ప్రభావిత ప్రాంతంలో పెద్ద విజయంగా చెబుతున్నారు. మార్టిన్ మరణం పిఎల్‌ఎఫ్‌ఐ సంస్థకు పెద్ద ఎదురుదెబ్బేనని చెప్పాలి. ప్రస్తుతం ఆపరేషన్ జరుగుతోందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
జూలై 26న, గుమ్లా జిల్లాలో నిషేధిత సంస్థ జార్ఖండ్ జన ముక్తి పరిషత్ (JJMP)తో అనుబంధంగా ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను గుమ్లా పోలీసులు, జార్ఖండ్ జాగ్వార్ దళాలు విజయవంతంగా మట్టుబెట్టాయి. ఉగ్రవాద సంస్థ కదలికల గురించి పోలీసులకు నిర్దిష్ట సమాచారం అందిన తర్వాత శనివారం ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. నిఘా వర్గాల సమాచారం ఆధారంగా జిల్లా పోలీసులు, జార్ఖండ్ జాగ్వార్ దళాలు సంయుక్తంగా ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు JJMP ఉగ్రవాదులు మృతి చెందారు.
Also read : Srushti Fertility Centre : సృష్టి కేసులో సంచలన విషయాలు.. ఆ గ్యాంగులతో నమ్రతకు లింకు