క్యాన్సర్‌ను జయించిన నవజ్యోత్ సిద్ధూ భార్య.. వేపాకు, నిమ్మరసంతో..

రాజకీయ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజోత్ కౌర్ క్యాన్సర్ స్టేజ్ 4ను జయించారు. బతికే అవకాశాలు ఎక్కువగా లేకపోయిన కేవలం నిమ్మరసం, వేపాకు, పసుపు వంటి సంప్రదాయ ఆహారాలతో 40 రోజుల్లోనే క్యాన్సర్‌ను జయించినట్లు సిద్ధూ ఇటీవల తెలిపారు.

New Update
Navjot singh Sidhu

మాజీ క్రికెటర్, రాజకీయ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజోత్ కౌర్ క్యాన్సర్ చివరి స్టేజ్‌ను జయించారు. నవజోత్ కౌర్ కేవలం 3 శాతం మాత్రమే బతికి ఉంటుందని వైద్యులు తెలిపారు. డబ్బు ఉండటం వల్ల ఆమె క్యాన్సర్ జయించలేదని, కేవలం ఆహార పదార్థాల ద్వారానే క్యాన్సర్ నుంచి బయటపడిందని నవజ్యోత్ సింగ్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఒక ఏడాది నుంచి ఆమె స్టేజ్ 4 క్యాన్సర్‌తో పోరాడుతోందని.. ఎలా అయిన తనని బతికించుకోవాలనే ఆశతో సహజంగా ప్రయత్నించినట్లు తెలిపారు. 

ఇది కూడా చూడండి: మహారాష్ట్రలో 'నితీష్ కుమార్' మోడల్.. సీఎం అభ్యర్థిపై బీజేపీ వ్యూహం ఇదేనా?

జీవనశైలిలో మార్పుల వల్ల..

జీవన శైలిలో మార్పులు ద్వారా నవజోత్ కౌర్ స్టేజ్ 4 క్యాన్సర్‌ను జయించినట్లు తెలిపారు. డైలీ డైట్‌లో కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కేవలం 40 రోజుల్లోనే ప్రమాదకరమైన క్యాన్సర్ నుంచి విముక్తి పొందారని వెల్లడించారు. అరుదైన రొమ్ము క్యాన్సర్‌తో బాధపడిన ఈమె పాటియాలాలో ఉన్న ఆసుపత్రిలలో కూడా చికిత్స తీసుకున్నారు. కానీ బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వైద్యులు తెలిపారన్నారు. 

ఇది కూడా చూడండి:  మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరు.. తెరపైకి కొత్త పేరు?

పసుపు, నిమ్మరసం, యాపిల్ సైడర్ వెనిగర్, వేపాకులు, తులసి వంటి పదార్థాలు ఆహారంగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ నుంచి బయటపడిందని తెలిపారు. వీటితో పాటు గుమ్మడికాయ, దానిమ్మ, ఉసిరి, బీట్‌రూట్, వాల్‌నట్‌ వంటివి తీసుకున్నారు. 

ఇది కూడా చూడండి:  హాయ్ .. హలో అంటూ ఫోన్ కాల్.. కట్ చేస్తే న్యూడ్ వీడియో!

డైలీ డైట్‌లో వీటిని చేర్చడం వల్ల.. ఇందులోని పోషకాలు శరీరానికి అందాయి. కొబ్బరి నూనె, కోల్డ్ ప్రెస్డ్ నూనె లేదా బాదం నూనెతో తయారు చేసిన వంటలు మాత్రమే తీసుకున్నట్లు తెలిపారు. అలాగే ఉదయం పూట టీ తాగడానికి పంచదార కాకుండా దాల్చిన చెక్క, లవంగాలు , బెల్లం, యాలకులు తీసుకున్నట్లు తెలిపారు.

ఇది కూడా చూడండి: TMC: బెంగాల్ ఉప ఎన్నికల్లో టీఎంసీ హవా.. బీజేపీ కంచుకోట బద్ధలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు