ఐసీయూలో రతన్ టాటా? విషమంగా ఆరోగ్యం?

టాటా గ్రూప్స్ అధినేత రతన్ టాటా ఆరోగ్యంపై మళ్ళీ వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన ఆరోగ్యం బాలేదని...ఐసీయూలో జాయిన్ చేశారని అంటున్నారు. అయితే దీనిపై ఇంకా ఏ రకమైన అధికారిక ప్రకటనా రాలేదు. 

New Update
tata

Ratan TATA: 

టాటా సన్స్ అధినేత రతన్‌ టాటా ఆరోగ్యం విషమంగా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ముంబైలోని ఓ హాస్పిటల్‌లో.. ఐసీయూలో చికిత్స పొందుతున్నారని వార్తలు వస్తున్నాయి. రక్తపోటు తగ్గడంతో రతన్‌ను హాస్పిటల్‌లో చేర్చారని చెబుతున్నారు. ప్రస్తుతం రతన్ టాటా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.  కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుస్తోంది. రతన్ టాటా వయసు 86 ఏళ్ళు. అయితే దీనిపై టాటా గ్రూ ఎలాంటి అధికారిక సమాచారం ఇప్పటివరకూ ఇవ్వలేదు. 

రెండు రోజల క్రితం కూడా రతన్ టాటా ఆరోగ్యం విషమంగా ఉందని వార్తలు వచ్చాయి. కానీ వాటిని కొట్టిపడేస్తూ తాను ఆరోగ్యంగానే ఉన్నానని...ఎలాంటి అవాస్తవాలను నమ్మొద్దని రతన్ టాటానే స్వయంగా ఎక్స్‌లో పోస్ట్ చేసారు. 

1991 నుంచి 2012 వరకు రతన్ టాటా...ట్రాటా సన్స్ ఛైర్మన్‌గా చేశారు. అంతకు ముందు టాటా గ్రూప్ కంపెనీ అయి టాటా ఇండస్ట్రీలో అసిస్టెంట్‌గా పనిచేశారు. ఆ తర్వాత కొన్ని నెలలపాటు జంషెడ్‌పూర్‌లోని టాటా ప్లాంట్‌లో శిక్షణ తీసుకున్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత, రతన్ టాటా గ్రూప్ బాధ్యతలను తీసుకున్నారు. నానో కార్ రతన్ టాటా కలల కార్ అని చెబుతారు ఆయన ఇచ్చిన ఐడియాల ప్రకారమే దానిని తయారు చేశారు. అతి తక్కువ ధరకే లభించిన నానో కార్స్‌ కొన్నేళ్ళు ఇండియన్ మార్కెట్లో తెగ సేల్స్ అయ్యాయి. తరువాత నానో కార్‌‌ ప్రడ్షన్‌ను ఆపేశారు. అయితే ఇప్పుడు దాని అప్డేటెడ్‌ వెర్షన్ నానో ఈవీలను మార్కెట్లోకి తీసకురానున్నారని తెలుస్తోంది. 

Also Read: Delhi: సీఎం అతిషి ఇంట్లో నుంచి సామాన్ల తొలగింపు..మండిపడుతున్న ఆప్

Advertisment
తాజా కథనాలు