Delhi: సీఎం అతిషి ఇంట్లో నుంచి సామాన్ల తొలగింపు..మండిపడుతున్న ఆప్ ఢీల్లీ ముఖ్యమంత్రి అతిషీ సామాన్లను ఆమె ఉంటున్న ఇంట్లో నుంచి బలవంతంగా తొలగించారు. రెండు రోజుల క్రితమే ఆమె అధికారిక బంగ్లాలోకి షిఫ్ట్ అయ్యారు. ఎందుకు ఇలా చేశారో కూడా కారణాలు తెలిడం లేదు. దీంతో కావాలనే బీజేపీ ఇది చేయించింది అంటూ ఆరోపిస్తోంది. By Manogna alamuru 09 Oct 2024 in నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Delhi CM Athishi Home: ఢిల్లీ సీఎం అతిషీ రెండు రోజుల క్రితమే మాజీ ముఖ్యమంత్రి కేజ్రీఆ ఖాళీ చేసిన ఇంట్లోకి షిప్ట్ అయ్యారు. అయితే ఈరోజు ఆ బంగ్లా నుంచి ఆమె వస్తువులను బలవంతంగా తొలగించి..సీలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. దీంతో ఈ విషయంలో గొడవ గొడవ అవుతోంది. బీజేపీ ఆదేశాల మేరకే..ఢిల్లీ గవరనర్ సక్సేనా ముఖ్యమంత్రి అతిషి వస్తువులను ఇంట్లో నుంచి తొలగించారంటూ ఆప్ ఆరోపణలు చేస్తోంది. దేశ చరిత్రలో మొదటిసారి ముఖ్యమంత్రి నివాసాన్ని ఖాళీ చేయించారని అంటోంది. సీఎం ఇంట్లోకి మారిన ఒక్కరోజులోనే ఇలా జరగడం ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయంగా మారింది. అయితే ఈ విషయం మీద లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ఇంకా స్పందించలేదు. వస్తువులు తొలగించడానికి కారణాలు ఏంటో కూడా ఇంకా తెలియలేదు. సెప్టెంబర్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ రాజీనామా చేయడంతో ఆ పదవిలోకి ఆప మంత్రి అతిషీ వచ్చారు. ఢిల్లీ ముఖ్యమంత్రికి అధికార నివాసం ఇస్తారు. దాంట్లో ఇంతకు ముందు వరకూ కేజ్రీవాల్ ఉండేవారు. ఆయన రాజీనామా చేశాక...కొన్ని రోజులు అంటే అక్టోబర్ 4వ తేదీ వరకూ ఆ ఇంట్లోనే ఉన్నారు. దాని తరువాతనే కొత్త సీఎం అతిషి అధికార బంగ్లాలోకి షిఫ్ట్ అయ్యారు. అక్టోబర్ 7న ఆమె ఇంట్లోకి వెళ్ళారు. రెండో రోజు అంటే అక్టోబర్ 9న అతిషీ సామాన్లు బయటపడేశారు. #WATCH | Visuals from outside the residence of Delhi Chief Minister, 6-flag Staff Road, Civil Lines. A team of PWD officials has reached here. Delhi CMO claims that Delhi LG got all the belongings of Chief Minister Atishi removed from the Chief Minister's residence. pic.twitter.com/L3ukGlWYLk — ANI (@ANI) October 9, 2024 Also Read: బీజేపీ గెలుపు,లాభాల్లో స్టాక్ మార్కెట్లు..ఏంటీ లింక్? మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి