Mumbai: ముంబైలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. గేట్‌వే ఆఫ్ ఇండియా సమీపంలో 114 మంది ప్రయాణీకులతో కూడిన పడవ బోల్తా పడింది. గేట్‌వే నుంచి ఎలిఫెంటా ద్వీపానికి వెళ్తుండగా బుచర్ ఐలాండ్ దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఓ స్పీడ్ బోట్ అదుపుతప్పి నీల్‌కమల్ ప్యాసింజర్ వెజెల్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. 13 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 101 మందిని నేవీ, కోస్ట్ గార్డు సిబ్బంది రక్షించారు. ప్రాణాలతో బయటపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా.. వారంతా నేవీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. 11 ఎయిర్‌క్రాఫ్ట్‌లు, 4 హెలిక్యాప్టర్ లు.. ఇక ఈ రెస్క్యూ ఆపరేషన్ కోసం 11 ఎయిర్‌క్రాఫ్ట్‌లు, 4 హెలిక్యాప్టర్‌లను వినియోగించినట్లు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తెలిపారు.ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం గురువారం ఉదయం అందుతుందని చెప్పారు. మృతుల కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.