National: విమానాల్లో స్కై మార్షల్ పెంపు..పౌరవిమానయానశాఖ నిర్ణయం

మూడు రోజులుగా విమానాల్లో బాంబులు పెట్టామంటూ మెసేజ్‌లు రావడం ఆందోళనగా మారింది. దీన్ని పౌరవిమానయాన శాఖ సీరియస్‌గా తీసుకుంది. ఈ రోజు జరిగిన పౌర విమానయాన అధికారుల అత్యున్నత సమావేశంలో..ఎయిర్ మార్షల్స్ ని రెట్టింపు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 

Flights Cancelled: 160 విమానాలు రద్దు..ఎందుకంటే!
New Update

More Air Marshal To Flights: 

మూడురోజల్లో 12 విమానాలకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. నిన్న ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు ఫ్లైట్లకు వరుసగా బాంబుల బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీ నుంచి చికాగో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంతో పాటు నాలుగు డొమెస్టిక్ విమానాలకు బాంబులు ఉన్నాయంటూ మెసేజ్‌లు వచ్చాయి.దీంతో పాటూ జైపూర్-బెంగళూరు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, దమ్మం-లక్నో ఇండిగో, దర్భంగా-ముంబై స్పైస్‌జెట్, సిలిగురి-బెంగళూరు ఆకాశ ఎయిర్ విమానాలకు ఎక్స్‌లో ఇలాంటి మెసేజ్‌లే వచ్చాయి.దీంతో వీటిని కాసేపు దగ్గరల్ఓని ఎయిర్‌‌ పోటర్‌‌లో ల్యాండ్ చేశారు అక్కడ తనిఖీలు చేసిన తర్వాత మళ్ళీ వాటిని గమ్యస్థానాలకు చేర్చారు. ఇవి కాకుండా  సౌదీ అరేబియా నుండి వచ్చిన ఇండిగో విమానానికి కూడా ఇదే బాంబు బెదిరింపు రావడంతో దీన్ని  జైపూర్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. దీంతో భద్రతా అధికారులు విమానాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇక ఈరోజు కూడా ఢిల్లీ నుంచి బెంగళూరు వెళుతున్న ఆకాశ ఫ్లైట్‌ లో బాంబు ఉందంటూ బెదిరింపు మెసేజ్ వచ్చింది. 

Also Read: AP:ఐదేళ్ళల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం..సీఎం చంద్రబాబు

 

ఈ నేపథ్యంలో  కేంద్ర పౌరవిమానయాన అధికారులు అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పౌర విమాన  మంత్రిత్వ శాఖ, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ, హోం మంత్రిత్వ శాఖ అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ భేటీలో అధికారులు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ.. బూటకపు కాలర్లను గుర్తించి వీరిని ‘నో ఫ్లై’ జాబితాలో చేర్చాలని నిర్ణయించింది. ఇదే విధంగా విమానాల్లో ఎయిర్ మార్షల్స్ సంఖ్యను రెట్టింపు చేయాలని కూడా నిర్ణయించారు. ఇందులో ఎన్ఎస్‌జీ కమాండో యూనిట్ ఎయిర్ మార్షల్స్‌ని ప్రధానంగా అంతర్జాతీయ మార్గాలు, దేశీయంగా సున్నితమైన మార్గాల్లో మోహరించనున్నారు. ఈ స్కై మార్షల్స్ సాధారణ ప్రయాణికుల్లా  విమానంలో ప్రయాణించనున్నారు. ఇది ఎప్పటి నుంఓ జరుగుతున్న ప్రక్రియే...ఇపుడు దీనిని మరింత బలోపేతం చేయనున్నారు.

Also Read: Israel: లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడి..మేయర్ సహా 15 మంది మృతి

ఇక బాంబు బెదిరింపులపై నివేదిక సమర్పించాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ , బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఇంటెలిజెన్స్ బ్యూరో లను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించినట్లు తెలుస్తోంది. విమానాల్లో బాంబులు బెదిరింపులు రావడం ఆందోళనకరం అని విదేశీ విమానశాఖలు, మంత్రిత్వ శాఖల నుంచి స్పందన రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

Also Read: Stock Market:నష్టాల్లో ముగిసిన సూచీలు..కొనసాగుతున్న డౌన్ ట్రెండ్

Also Read: రైతులకు మోదీ సర్కార్ అదిరిపోయే దీపావళి గిఫ్ట్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు!

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe