/rtv/media/media_files/2024/10/16/RXqskf3ta14iAYd0NJxr.jpg)
Israel Attackes:
నిన్న అర్ధరాత్రి లెబనాన్ మీ ఇజ్రాయెల్ మరోసారి దాడులు చేసింది. పౌరుల నివాస స్థలాల మధ్య ఉన్న హెజ్‌బొల్లా మిలిటెంట్ స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ దాడులు చేయడంతో..మేయర్ సహా పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో మేయర్ అహ్మద్ కహిల్ మరణించారని.. నబాతియే ప్రావిన్స్ గవర్నర్ హువైదా టర్క్ ప్రకటించారు. ఈయనతో పాటూ మరో 15మంది ప్రాణాలు కోల్పోయారని లెబాన్ డిఫెన్స్ తెలిపింది. ఇజ్రాయెల్ ప్రయోగించిన క్షిపణుల దాడికి లెబనాన్‌లో భవనాలు కూల్పోయాయి. వీట నుంచి ఇప్పటికి 15 మందిని వెలికి తీశారు. శిథిలాల కింద మరి కొంత మంది ఉండే అవకాశం ఉందని డిఫెన్స్ ఫోర్స్ చెబుతోంది.
Many Israeli strikes this morning on south Lebanon's Nabatieh (video below). The town's mayor is reportedly among those killed.
— Alex Rowell (@alexjrowell) October 16, 2024
Strikes also in Beirut's suburbs for the first time in several days.
An earthquake was also felt. https://t.co/ArCRDxfAtP
Also Read: కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు తప్పిన ప్రమాదం.. హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్!
మరోవైపు ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఆదివారం ఐక్యరాజ్య సమితి సైనికులు కూడా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో హెజ్బుల్లా స్సంథ సభ్యులు ఉన్నరని అనుమానం ఉన్న ప్రాంతాల నుంచి ఐరాస దళాలు వెంటనే వైదొలగాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు డిమాండ్ చేశారు. దక్షిణ లెబనాన్‌పై భూతల దాడులు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 250 మందికి పైగా హెజ్‌బొల్లా ఫైటర్లు మరణించినట్లు ఐడీఎఫ్ చెప్పింది. వీరిలో 21 మంది కమాండర్లు ఉన్నట్లు తెలిపింది. మొత్తంగా హెజ్‌బొల్లాకు సంబంధించి సైనిక సామర్థ్యాలను భారీగా దెబ్బతీశామని.. అయినప్పటికీ ఇజ్రాయెల్‌పై దాడి చేసే సామర్థ్యాలు ఇంకా వారి దగ్గర మిగిలి ఉన్నాయని ఐడీఎఫ్ చెబుతోంది.
Also Read: రైతులకు మోదీ సర్కార్ అదిరిపోయే దీపావళి గిఫ్ట్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు!
ఇదే ఆదివారం రాత్రి సెంట్రల్ గాజాలోని ఓ పాఠశాలపై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో చిన్నారులు తో పాటు 20 మంది మృతి చెందారు. అదే రోజు రాత్రి జరిగిన మరో దాడిలో నుసిరత్‌లోని ఇద్దరు మహిళలు చనిపోయారు. ఏడాదిగా జరుగుతున్న యుద్ధం వల్ల నిరాశ్రయులైన అనేక మంది పాలస్తీనియన్లకు ఆశ్రయం కల్పించడం కోసం ఈ పాఠశాలను ఓ శరణార్థి శిబిరంగా మార్చారు. మరోవైపు సెంట్రల్ ఇజ్రాయెల్‌లోని ఆర్మీ బేస్‌ను టార్గెట్ చేసుకుని హెజ్‌బొల్లా డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో తమ సైనికులు నలుగురు మరణించారని, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.
Also Read: Stock Market:నష్టాల్లో ముగిసిన సూచీలు..కొనసాగుతున్న డౌన్ ట్రెండ్