బిహార్ ఎన్నికల ఫలితాలపై సంచలన సర్వే.. గెలుపు ఎవరిదంటే?

బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలు సర్వేలు ప్రజల మనోభావాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా పీపుల్స్ పల్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నిర్వహించిన ' బిహార్ మూడ్ రిపోర్ట్' సర్వే ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

New Update
bihar elections

బిహార్ రాజకీయాలు ప్రస్తుతం వేడెక్కుతున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలు సర్వేలు ప్రజల మనోభావాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా పీపుల్స్ పల్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నిర్వహించిన ' బిహార్ మూడ్ రిపోర్ట్' సర్వే ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

హోరాహోరీగా పోటీ

గత అసెంబ్లీ ఎన్నికల్లో లాగానే ఇండియా, ఎన్డీయే కూటముల మధ్యే హోరాహోరీగా పోటీ ఉండనుందని ఈ సర్వేలో అంచనా వేశారు. ఈ సర్వేలో NDA అటు ఇటుగా 1 శాతం మాత్రమే ఆధిక్యంలో ఉంది. కుల రాజకీయాలు, టిక్కెట్ వ్యూహాలు, కూటమి ఐక్యత ప్రమాణాలు లాంటి ఈ ఒక్క శాతాన్ని తారుమారు చేయగలవని నిపుణులు భావిస్తున్నారు.

2025 అక్టోబర్/నవంబర్‌లో జరిగే శాసనసభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 41 నుండి 44 శాతం, ‘ఇండియా’ కూటమికి 40 నుండి 42.5 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయని మూడ్ సర్వేలో తేలింది. 

2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ 30 శాతం ఓట్లతో, బీజేపీ 29 శాతం ఓట్లతో ఆధిపత్యం కనబరుస్తూ రెండు కూటముల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. బీహార్ ఎన్నికల్లో రెండు కూటముల మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటాపోటీగా ఉండబోతున్నది. ప్రశాంత్ కిశోర్ స్థాపించిన జన్ సురాజ్ పార్టీ (జేఎస్పీ) 6 నుండి 8 శాతం ఓట్లతో నిర్ణయాత్మక పాత్ర పోషించనుంది. ఇతరులు 7.5 నుండి 9 శాతం ఓట్లు పొందే అవకాశాలున్నాయి. ఈ గణాంకాల్లో 3 శాతం పెరగొచ్చు లేదా తగ్గే అవకాశాలున్నాయి. కుల రాజకీయాలకు పెట్టింది పేరైన బీహార్‌లో స్థానిక సమస్యలు, సంక్షేమ హామీలు, పార్టీలలో అసంతృప్తులు ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి.

జేడీయూ, బీజేపీ పొత్తు

గత కొద్ది సంవత్సరాలుగా బిహార్ రాజకీయాల్లో నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీయూ, బీజేపీ మధ్య పొత్తు అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో, ప్రతిపక్షమైన ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి తేజస్వి యాదవ్ నాయకత్వంలో బలపడే ప్రయత్నంలో ఉంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, కుల గణన నివేదికలు వంటివి బిహార్ రాజకీయాలను ప్రభావితం చేశాయి. ఎన్నికల ముందు పార్టీలు కుల సమీకరణాలు, కొత్త వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్తున్నాయి.

ఈ సర్వేలో పాల్గొన్న 5,635 మందిలో యువత, మహిళలు, గ్రామీణ ఓటర్లు మార్పును కోరుకుంటున్నారని స్పష్టమైంది. నితీష్ కుమార్ ప్రభుత్వం దాదాపు రెండు దశాబ్దాలుగా అధికారంలో ఉండటంతో, ప్రజల్లో సహజంగానే మార్పు కోసం ఆసక్తి పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. యువతలో నిరుద్యోగం, అవినీతి వంటి అంశాలు ప్రభుత్వ వ్యతిరేకతకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.

మరోవైపు, ప్రతిపక్షంలో ఉన్న ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి ఈ ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తోంది. అయితే, ఆర్జేడీ గత పాలనపై ఉన్న వ్యతిరేకత ఇంకా పూర్తిగా తొలగిపోలేదని, అదే ఆ పార్టీకి ప్రధాన సవాలుగా ఉందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రతిపక్ష కూటమి నాయకుడు తేజస్వీ యాదవ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నంలో ఉన్నారు.

Advertisment
తాజా కథనాలు