రైతులకు మోదీ సర్కార్ అదిరిపోయే దీపావళి గిఫ్ట్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు!

మోదీ ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. దీపావళి కానుకగా రబీ సీజన్‌లో పంటల కనీస మద్దతు ధర (MSP)ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గోధుమ పంటకు క్వింటాల్ రూ.150, ఆవాల పంటపై క్వింటాల్‌కు రూ.300 చొప్పున పెంచింది.

modi 4
New Update

మోదీ ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. దీపావళి కానుకగా రబీ సీజన్‌లో పంటల కనీస మద్దతు ధర (MSP)ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మొత్తం ఆరు పంటలకు కనీస మద్దతు ధరను పెంచింది. ఇందులో గోధుమ పంటకు క్వింటాల్ రూ.150, ఆవాల పంటపై క్వింటాల్‌కు రూ.300 చొప్పున పెంచింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యం దిశగా పీఎం అన్నదాత ఆయ్‌ సంరక్షణ్‌ అభియాన్‌కు రూ.35 వేల కోట్లు ఇచ్చేందుకు మోదీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 

Also Read: హర్యానా సీఎంగా మరోసారి నాయబ్ సింగ్ సైనీ.. ప్రమాణస్వీకారం ఎప్పుడంటే ?

ఆరు పంటలకు పెంపు

రబీ పంటల సీజన్‌కు సంబంధించి నాన్ యూరియా ఎరువులకు రూ. 24,475 కోట్ల సబ్లిడీకీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2025-2026 ఏడాదికి గోధుమతో పాటు ఆరు పంటలకు కనీస మద్ధతు ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గోధుమపై క్వింటాల్‌కు రూ.150 పెంచడంతో గతంలో రూ.2275 గా ఉన్న కనీస మద్దతు ధర రూ.2425కి పెరిగింది. ఆవాలకు రూ.300 పెంచగా గతంలో ఎంఎస్పీ ధర రూ.5650 ఉండగా.. ఇప్పుడు రూ.5950కి చేరింది. 

Also Read: కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు తప్పిన ప్రమాదం.. హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్!

బార్లీకి క్వింటాల్‌కు రూ.130 పెంచడంతో గతంలో రూ.1850 ఉండగా ఇప్పుడు రూ.1980కి ఎంఎస్పీ పెరిగింది. శెనగలకు క్వింటాల్‌కు రూ.210 పెంచింది. దీంతో గతంతో ఈ పంటకు రూ.5440 ఉండగా తాజాగా రూ.5650కి చేరింది. పెసరకు క్వింటాల్‌కు రూ.275 పెంచగా.. గతంలో రూ.6425 ఉండగా ఇప్పడు రూ.6700కు చేరింది. ఇక పొద్దు తిరుగుడు గింజలకు క్వింటాల్‌కు రూ.140 పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ పంట కనీస మద్దతు ధర రూ.5800 నుంచి తాజాగా రూ.5940కి చేరింది. 

Also Read: ఖగోళ అద్భుతం.. మరో 80 వేల ఏళ్ల వరకు రాదు!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా

ఇలా మొత్తంగా ఆరు పంటలకు మోదీ సర్కార్‌ కనీస మద్దతు ధరలను పెంచుతూ రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో గంగా నదిపై కొత్త రైల్వే కమ్ రోడ్డు వంతెన నిర్మాణానికి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ ప్రాజెక్టు కోసం రూ.2,642 కోట్లు ఖర్చు చేయనుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం డీఏను కూడా పెంచిన సంగతి తెలిసిందే. 

Also Read: ముఖ్యమంత్రిగా ఒమర్‌ అబ్దుల్లా ప్రమాణస్వీకారం

#modi #rabi-crops
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe