TN: గవర్నర్‌‌ను రీకాల్ చేయండి...కేంద్రానికి స్టాలిన్ డిమాండ్

కేంద్రం మీద తమిళనాడు ముఖ్యమంత్రి విపరీతంగా మండిపోతున్నారు. ఇంతకు ముందు హిందీని రుద్దుతున్నారంటూ ప్రధానికి లేఖ రాసిన స్టాలిన్...ఇప్పుడు గవర్నర్‌‌ను రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు. గవర్నర్ ఆర్‌‌ఎన్‌రవి కావాలనే ద్రవిడ అనే పదాన్ని దాటవేశారని ఆరోపించారు. 

tn
New Update

Recall governor..CM Stalin: 

తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్‌రవి జాతి ఐక్యతను దెబ్బతీసే విధంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం స్టాలిన్. ఆయన ఉద్దేశపూర్వకంగానే ద్రవిడ అనే పదాన్ని దాటవేశారని ఆరోపించారు. అసలే చెన్నైలో దూరదర్శన్ గోల్డెన్ జూబ్లీ కార్యక్రమాలు నిర్వహించడంపై మండిపడుతున్న  స్టాలిన్ ఇప్పుడు రాష్ట్ర గేయంలో ద్రావిడ పదాన్ని తొలగించడంపై కోపం వ్యక్తం చేశారు. 

చెన్నైలోని దూరదర్శన్‌ గోల్డెన్‌ జూబ్లీ కార్యక్రమం ఈరోజు అయింది. ఇదే ఈవెంట్‌లో హిందీ మాసోత్సవం కూడా నిర్వహించారు. హిందీని, హిందీ భాషేతర రాష్ట్రాల ఈవెంట్‌ను ఒకసారే చేయడం ఏంటని..హిందీ ప్రాథమిక భాష కానీ రాష్ట్రంలో హిందీ భాషకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించడం ఏంటంటూ సీఎం అసహనం వ్యక్తం చేశారు. తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించాలనే ఆలోచన చేసే ముందు పునరాలోచించుకోవాలంటూ ప్రధాని మోదీకి స్టాలిన్ లేఖ రాశారు. భారత రాజ్యాంగం ఏ భాషకు జాతీయ హోదా ఇవ్వలేదని, హిందీ-ఇంగ్లీష్ కేవలం అధికారిక ప్రయోజనాల కోసమే మాత్రమే ఉన్నాయని గుర్తు చేశారు. బహు భాషలతో నిండి ఉన్న భారతదేశంలో.. హిందీకి ప్రత్యేక హోదా ఇవ్వడం, హిందీ మాట్లాడని రాష్ట్రాలలో హిందీ మాసాన్ని జరపడం లాంటివి ఇతర భాషలను కించపరచడమే అవుతుందని అన్నారు.

ఇప్పుడు ఈవెంట్‌ సందర్భంగా రాష్ట్ర గేయాన్ని ఆలపిస్తూ.. ద్రవిడ అనే పదాన్ని గాయకులు దాటవేయడంపై వివాదం నెలకొంది. దీనిపై దూరదర్శన్‌ తమిళ్‌ క్షమాపణ కూడా చెప్పింది. గాయకుల పొరపాటుగా చెప్పింది. యితే స్టాలిన్ మాత్రం గవర్నర్ కూడా ద్రావిడ అన్న పదాన్ని ఉచ్ఛరించలేదని...కావాలనే దేశ ఐక్యత దబ్బ తీసే విధంగా ఆర్ఎన్ రవి ప్రవర్తించారని ఆరోపిస్తున్నారు స్టాలిన్. దేశ ఐక్యతను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన ఆయన.. గవర్నర్‌ పదవికి ఏమాత్రం అర్హులు కాదంటూ ఆరోపించారు. రాష్ట్ర గేయంలో ఆ పదాన్ని ఉచ్చరించకపోవడం చట్టరీత్యా నేరమన్నారు. ఒకవేళ జాతీయ గీతంలో ద్రవిడ అనే పదం వస్తే ఇలానే వదిలేస్తారా? అని ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగా తమిళనాడును,  ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న గవర్నర్‌ను తక్షణమే రీకాల్‌ చేయాలని కేంద్రాన్ని స్టాలిన్‌ డిమాండ్‌ చేశారు. అయితే గవర్నర్ ఆషీప్ మాత్రం ఇందులో ఆయన తప్పేమీ లేదంటూ వెనకేసుకువచ్చింది. గాయకుల పొరపాటు వల్లనే అలా జరిగిందని చెప్పుకొచ్చింది. 

Also Read: UAE: భారతీయులకు బంపర్ ఆఫర్..యూఏఈ వీసా ఆన్ అరైవల్

 

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe