Uttar Pradesh: ఆగ్రా లో కూలిన మిగ్–29 విమానం

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు దగ్గరలో మిగ్–29 యుద్ధ విమానం కుప్పకూలింది.  అయితే పైలట్ ముందే అప్రత్తమత్తమయి ముందే దూకేయడంతో సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు.  విమానం పూర్తిగా కాలి బూడిద అయింది.

New Update
29

Mig 29 Fighter Jet: 

విన్యాసాల కోసం వెళుతున్న యుద్ధవిమానం ప్రమాదానికి గురైంది. పంజాబ్ లోని అందపూన్ నుంచి బయల్దేరిన ఫైటర్ జెట్ మిగ్–29 ఆగ్రా వెళుతుండగా ఈ ఘటన జరిగింది. మరికొన్ని నిమిషాల్లో ఆగ్రా సమీపిస్తుంది అనగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కుప్పకూలిన చోట విమానం నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఇందులో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. ప్రాణ నష్టం సంభవించలేదు. ఫ్లైట్ కూలిపోతుందని ముందే గ్రహించిన పైలట్ విమానం నుంచి దూకేయడంతో ప్రాణాలతో బయటపడ్డారు. 

మిగ్–29 యుద్ధ విమానాలు ఇంతకు ముందు కూడా చాలా ప్రమాదాలకు గరైయ్యాయి.  సెప్టెంబర్‌ 2న రాజస్థాన్‌లోని బార్మేర్‌లో శిక్షణ నేపథ్యంలో మిగ్‌- 29 ఫైటర్‌ జెట్‌ కుప్పకూలింది. అంతకు ముందు కూడా ఒకటి, రెండు సార్లు ఇలాగే కుప్పకూలాయి. విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తడం వల్లనే కూలిపోతున్నాయని తెలుస్తోంది. దీంతో వీటిపై క్షుణ్ణంగా పరిశీలన చేయాలని రక్షణ శాఖ భావిస్తోంది. 

Also Read: మహిళా ఓట్ల కోసం డెమోక్రటిక్ పార్టీ యాడ్ వైరల్..రిపబ్లికన్ల విమర్శలు

Advertisment
తాజా కథనాలు