మహిళా ఓట్ల కోసం డెమోక్రటిక్ పార్టీ యాడ్ వైరల్..రిపబ్లికన్ల విమర్శలు

అమెరికా అధ్యక్షుడిగా ఎవరన్నది మరొక రోజులో తేలబోతోంది. ఈ నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇరు పార్టీలు తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి.ఇందులో భాగంగా డెమోక్రటిక్ పార్టీ మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు ఒక యాడ్‌ను రూపొందించింది. అది వైరల్ గా మారింది. 

author-image
By Manogna alamuru
New Update
Kamala Harris: 85 నిమిషాల పాటు దేశాధ్య‌క్షురాలిగా కమలా హ్యారిస్‌!

Democratic women Support AD: 

చివరి నిమిషం వరకూ ఎన్ని విధాలుగా అయితే అన్ని విధాలుగా ఓటర్లను ఆకర్షించాలని డిసైడ్ అయ్యాయి..రిపబ్లికన్, డమోక్రటిక్ పార్టీలు. రిపబ్లిక్ అభ్యర్ధి ట్రంప్ నార్త్ కరోలినాలో మకాం వేశారు. రేపు అక్కడ చివరి ప్రచారం నిర్వహించనున్నారు. మరోవపు కమలా హారిస్ కూడా తన చివరి ప్రచారాలను కొనసాగిస్తున్నారు. ఇక ఇరు పార్టీల మద్దతు దారులు మిగిలిన అన్ని ప్రయత్నాలను చేస్తున్నారు. తాజాగా డెమోక్రటిక్ పార్టీ మద్దతుదారులు ఒక యాడ్‌ను రూపొందించారు. అది వైరల్ గా మారింది. 

యాడ్‌లో ఒక అమెరికన్ జంట ఓటేయడానికి వస్తుంది. వారిద్దరూ అమెరికన్ ఫ్లాగ్ టోపీలను ధరించి ఉంటారు. సాధారణంగా రిపబ్లికన్ మద్దుతుదారులు ఈ టోపీలను ధరిస్తుంటారు. ఇందులో భర్త, ట్రంప్‌కే ఓటేస్తాడు. తన భార్య కడా ఆయనకే ఓటేస్తుందని భావిస్తాడు. కానీ చివరిలో ఆ భార్య, మరొక మహిళ ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుని కమలా హారిస్ కు ఓటేస్తారు. మీకు కావాల్సినవారికి మీరు ఓటు వేయొచ్చు. ఆ ఓటు గురించి ఎవరికీ తెలియదు. బూత్‌లో ఏం జరిగిందో..అది బూత్‌కే పరిమితమవుతుంది అంటూ ఈ వీడియోకు నటి జూలియా రాబర్ట్స్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇలాంటిదే మరో యాడ్‌లో తమ భార్యలు ట్రంప్‌కే ఓటేస్తారని భర్తలు మాట్లాడుకుంటుంటారు. కానీ వారు మాత్రం కమలాకు ఓటేస్తారు. ఈ రెండు యాడ్‌లు తెగ వైరల్ అయ్యాయి. అయితే ట్రంప్ మద్దతుదారులు మాత్రం వీటినే తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇదంతా మూర్ఖత్వమని విమర్శించారు. భార్య తాను ఎవరికి ఓటు వేసిందో భర్తకు చెప్పకుండా ఉంటుందా అంటూ ప్రశ్నిస్తున్నారు. 

ఇప్పటి వరకూ అమెరికా అధ్యక్ష పీఠాన్ని మహిళ అధిరోహించిన చరిత్ర లేదు. ఈ సారైనా అధ్యక్ష పదవికి అమెరికన్లు మహిళను ఎన్నుకుంటారా? అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతున్నది.  గతంలో హిల్లరీ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేశారు. అయితే ఆమె ట్రంప్ చేతిలో పరాజయం పాలయ్యారు. ఇప్పుడు కూడా కమలా హారిస్ మళ్ళీ ట్రంప్ మీదనే పోటీ చేస్తున్నారు. 

అమెరికా ఒక దేశంగా తయారై  235 ఏళ్ళు అవుతోంది. ఇన్నేళ్ళల్లో 46 మంది అధ్యక్షులు ఎన్నికయ్యారు. కానీ ఇందులో ఒక్క మహిళా అధ్యక్షురాలు కూడా లేదు. ఇప్పుడు కూడా ఇదే రిపీట్ అవుతుందా...అలా అయితే అగ్రరాజ్యంలో పురుషాధిక్యత ఉందనే చెప్పాలేమో అని రాజకీయ నిపుణులు అంటున్నారు. దానికన్నా మహిళ పట్ల వివక్ష అనడం సబబు అని కూడా అంటున్నారు. ట్రంప్ పై 2016లో హిల్లరీ క్లింటన్ పోటీ చేసి చివరివరకూ గట్టిపోటీ  ఇచ్చినప్పటికీ ఆమె గెలవలేకపోయారు. ఇప్పుడు ఎనిమిదేళ్ల తరువాత మరోసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో మరో మహిళ కమలాహారిస్ నిలబడ్డారు. ఇప్పుడు ఈమె కూడా ట్రంప్‌కు గట్టి పోటీనే ఇస్తున్నారు. సర్వేలు కూడా కచ్చితంగా ఎవరు గెలుస్తారు అనేది చెప్పలేకపోతున్నాయి. అయితే ఒకటి, రెండు శాతాలు ట్రంప్‌ విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నాయి. అలా అయితే  మహిళకు మళ్ళా అధ్యక్ష పదవి పోయినట్టు అవుతుంది.

 

Also Read: మరికొన్ని గంటల్లో అమెరికా ఎన్నికలు..స్వింగ్ స్టేట్స్‌లో ముందంజలో ఎవరు?

 

Advertisment
Advertisment
తాజా కథనాలు