BIG BREAKING : కర్రెగుట్టలో భారీ ఎన్‌కౌంటర్..  ఐదుగురు మావోయిస్టుల హతం

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్ట అటవీ ప్రాంతం మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది. భద్రతా బలగాలు చేపట్టిన భారీ ఆపరేషన్‌లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు.

New Update
BREAKING NEWS

BREAKING NEWS

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్ట అటవీ ప్రాంతం మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది. భద్రతా బలగాలు చేపట్టిన భారీ ఆపరేషన్‌లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. మావోయిస్టు అగ్రనేతలే లక్ష్యంగా సుమారు 5 వేల మంది సీఆర్‌పీఎఫ్,  గ్రేహౌండ్స్,  ఛత్తీస్‌గఢ్ బలగాలు సంయుక్తంగా ఈ కూంబింగ్ నిర్వహించాయి. 

ఈ క్రమంలో బలగాలకు మావోయిస్టులు తారసపడటంతో ఇరువర్గాల మధ్య భీకరమైన ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు అక్కడికక్కడే మరణించగా, మృతుల్లో కీలకమైన అగ్రనేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అడవిలో ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్-2 కగార్ లో భాగంగా ఈ దాడులు జరుగుతున్నాయి. దేశాన్ని మావోయిస్టు రహితంగా మార్చడమే లక్ష్యంగా కేంద్ర హోంశాఖ ఈ ఆపరేషన్‌ను అత్యంత వేగంగా ముందుకు తీసుకెళ్తోంది. ముఖ్యంగా మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ వంటి వారిని పట్టుకోవడమే లక్ష్యంగా బలగాలు అడవిని జల్లెడ పడుతున్నాయి. ఈ ఆపరేషన్ దెబ్బకు ఇప్పటికే చాలా మంది మావోయిస్టులు లొంగిపోవడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం అందుతోంది. 

మార్చి 31 డెడ్‌లైన్‌

కాగా  ఆపరేషన్‌ కగార్‌ను 2024 జనవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఉనికిని పూర్తిగా తుడిచిపెట్టడానికి కేంద్రం మార్చి 31వ తేదీని డెడ్‌లైన్‌గా విధించింది. అంటే ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి భద్రతా బలగాలకు కేవలం మరో 40 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ లోపే అగ్రనేతలందరినీ పట్టుకోవాలని లేదా వారు లొంగిపోయేలా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే సరిహద్దు అడవుల్లో భారీ ఎత్తున బలగాలను మోహరించి వేటను ఉధృతం చేశారు.

Advertisment
తాజా కథనాలు