ఆర్థికవేత్తగా ఈ మంత్రం చదివి.. ఇండియాని రక్షించిన మన్మోహన్ సింగ్

మన్మోహన్ సింగ్ ఇండియాను 1991 ఆర్థిక సంక్షోభం నుంచి రక్షిం,చారు. ఆయన్ను రాజ్యసభకు నామినేట్ చేసి ఆర్థిక శాఖమంత్రిగా బాధ్యతలు ఇచ్చింది అప్పటి కేంద్ర ప్రభుత్వం. ఆయన హయాంలో భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు అధికంగా నమోదైంది. విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించారు.

author-image
By K Mohan
New Update
Manmohan Singh

man mohan Photograph: (man mohan)

1991లో భారతదేశ ఖజానా దివాళా తీసింది. దిగుమతులే తప్పా.. ఎగుమతులు లేవు. ఇండియాకు అప్పు కూడా పుట్టడం లేదు. ప్రపంచ బ్యాంక్ చేతులెత్తేసింది. దేశంలో ఆర్థికమాంధ్యం, మరోపక్క నిరుద్యోగం తాండవం చేస్తున్నాయి. భారీ లోటు బడ్జెట్ కారణంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేని పరిస్థితి. ఆ టైం ఏలాంటిదంటే.. పార్లమెంట్‌లో కాంగ్రెస్ పార్టీ ఫుల్ మెజార్టీ వచ్చినా.. ప్రధానిగా బాధ్యతలు చేపట్టడానికి ఎవరూ ముందుకు రావడంలేదు. సోనియాగాంధీ పీవీ. నర్సింహరావుని ప్రధాన మంత్రిగా ప్రకటించింది. ఈ పరిస్థితిని నుంచి ఇండియాను గట్టెంకించేది ఆయనొక్కరే అని కాంగ్రెస్ అధిష్ఠానానికి అర్థమైంది. అప్పటి వరకూ పార్లమెంట్‌ చట్ట సభల్లోలేని ఆయన్ను రాజ్యసభకు నామినేట్ చేసి.. ఆర్థిక శాఖమంత్రిగా పగ్గాలు అప్పగించారు. ఆయనొవరో కాదు.. ది గ్రేట్ ఎకనమిస్ట్ మన్మోహన్ సింగ్. ప్రజలు ఓట్లు వేసి గెలిపించకపోయినా ఆయన అవసరం కేంద్ర ప్రభుత్వం గుర్తించిందంటే అర్థం చేసుకోవచ్చు. ఆయన ఎంతటి సమర్థుడో.. ఆర్థికవేత్త మన్ మోహన్ సింగ్ ఇండియా ఫినాన్స్ చక్రం తిప్పితే. ఐదేళ్లలోనే అంతా సెట్ అయ్యింది. ఆర్థిక సంక్షోభం నుంచి భారత్ కోలుకుంది.

ఆయన పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి 1952లో అర్థశాస్త్రములో బ్యాచిలర్స్ డిగ్రీ, 1954లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసాడు. ఆ తరువాత1957లో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్స్, 1962లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటిలో డాక్టరేట్ పూర్తి చేశారు. ఇంత పెద్ద చదువులు చదివారు కాబట్టే.. తీసుకెళ్లి ఇండియన్ ఎకానమిని ఆయన చేతుల్లో పెట్టారు. ఆర్థిక మంత్రిగా, ప్రధాన మంత్రి ఆర్థిక సలహాదారుగా కూడా ఆయన పని చేశారు. ఇండియా ఆర్థిక పరిస్థితి చక్కబెట్టడానికి మన్ మోహన్ సింగ్ చదివిన మంత్రం ఏంటో తెలుసా.. అవే ఆర్థిక సంస్కరణలు. మన్ మోహన్ సింగ్ సమర్థతను చూసి కాంగ్రెస్ పార్టీ తర్వాతి 10 సంవత్సరాలు 2004 నుంచి 2014 వరకు ఆయనకే ప్రధానమంత్రి బాధ్యతలు ఇచ్చింది. దేశ రూపురేఖల్ని మార్చిన ఆయన ఆర్థికసంస్కరణలు ఇవే..

ఆర్థిక సరళీకరణ (1991)

మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు, భారతదేశ ఆర్థిక వ్యవస్థను సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ దిశలో తీసుకెళ్లడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. దిగుమతి-ఎగుమతి విధానాన్ని సంస్కరించారు. విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించారు. దీని కారణంగా భారతదేశంలో ఉపాధి అవకాశాలు పెరిగాయి. ప్రజల ఆదాయం పెరిగింది. ఆయన హయాంలో భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు అధికంగా నమోదైంది. భారతదేశ GDP వృద్ధి రేటు 2004-2008 మధ్య 8% కంటే ఎక్కువగా ఉంది.

గ్రామీణ ఉపాధిహామీ పథకం (2005)

మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 2005లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA)ను ప్రవేశపెట్టింది. దాని ప్రభావం నేడు ఎక్కువగా కనిపిస్తుంది. దీని ప్రధాన లక్ష్యం కరువు, నిరుద్యోగితను రూపుమాపడం.

సమాచార హక్కు (RTI) (2005)

మన్మోహన్ సింగ్ ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని రూపొందించింది. ఇది పారదర్శకత, జవాబుదారీతనానికి హామీ ఇచ్చింది.

అణు ఒప్పందం (2008)

మన్మోహన్ సింగ్ 2008లో USతో చారిత్రాత్మకమైన భారతదేశం-అమెరికా పౌర అణు ఒప్పందంపై సంతకం చేశారు. ఇది భారతదేశం ప్రపంచ అణు మార్కెట్లోకి ప్రవేశించడానికి, ఇంధన సంక్షోభాన్ని అధిగమించడానికి సహాయపడింది.

ఆధార్ పథకం (2009)

ప్రతి భారతీయ పౌరుడికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యను అందించాలనే లక్ష్యంతో మన్మోహన్ సింగ్ హయాంలో ఆధార్ పథకం ప్రారంభించారు. 

విద్యా హక్కు (2009)

మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉచిత, నిర్బంధ విద్య కోసం బాలల హక్కు చట్టాన్ని అమలు చేసింది. ఇది పిల్లలందరికీ విద్యా హక్కును విస్తరించింది.

మహిళా రిజర్వేషన్, సాధికారత

మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది.

గ్రామీణాభివృద్ధి, సామాజిక, ఆరోగ్య సంస్కరణలు

రోడ్లు, విద్యుత్, నీటి సౌకర్యాలకు ప్రాధాన్యతనిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మన్మోహన్ సింగ్ భారత్ నిర్మాణ్ యోజనను ప్రారంభించారు.  మన్మోహన్ సింగ్ జననీ సురక్ష యోజన  జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ వంటి పథకాలను ప్రారంభించారు. ఇది తల్లి ఆరోగ్యం, గ్రామీణ ఆరోగ్య సేవలను మెరుగుపరిచింది.

Advertisment
తాజా కథనాలు