Haryana: హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీని హత్య చేస్తానని బెదిరించిన యువకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఈ బెదిరింపులకు పాల్పడ్డ నిందితుణ్ని జింద్ జిల్లా దేవేరార్ గ్రామానికి చెందిన అజ్మీర్ గా పోలీసులు గుర్తించారు. జులానాలోని వాట్సాప్ గ్రూపులో హర్యానా ముఖ్యమంత్రిని మర్డర్ చేస్తానని బెదిరింపులకు దిగాడు.
Also Read: నువ్వా–నేనా అంటున్న కమలా, ట్రంప్..ఫలితాన్ని నిర్ణయించనున్న స్వింగ్ స్టేట్స్
అక్టోబర్ 8 న హర్యానాలో ఓట్ల లెక్కింపు జరిగిన సమయంలో అజ్మీర్ వాట్సాప్ గ్రూపులో ఈ బెదిరింపులకు పాల్పడినట్లు జింద్ పోస్పీ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ విషయం పోలీసులు దృష్టికి రావడంతో వెంటనే అజ్మీర్ ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. హర్యానాలోని జులానా నియోజకవర్గంలో ఇటీవల హాట్ టాపిక్ గా మారింది.
Also Read: జైలు మింగేసిన ఆదర్శ జీవితం–ప్రొఫెసర్ సాయిబాబా
ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి, రెజ్లర్ వినేష్ ఫోగట్ బరిలో నిలిచారు. ఆమె తన ప్రత్యర్థి, బీజేపీకి చెందిన యోగేష్ కుమార్‌ని 6015 ఓట్ల తేడాతో ఓడించారు. మొత్తంగా హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 48 సీట్లను గెలుచుకుని మరోసారి అధికారం చేజిక్కించుకోబోతుంది.
Also Read: భారత బ్యాటర్ల ఊచకోత..ప్రపంచ రికార్డు అడుగు దూరంలో మిస్
ఇదిలా ఉంటే మరోవైపు కాంగ్రెస్ 37 సీట్లకే పరిమితమైంది. వరుసగా మూడోసారి హర్యానా ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు. ఎలాగైనా గెలుస్తాం అనుకున్న కాంగ్రెస్ కి ఈ సారి కూడా నిరాశే మిగిలింది.