Cricket: భారత బ్యాటర్ల ఊచకోత..ప్రపంచ రికార్డు అడుగు దూరంలో మిస్ బంగ్లాదేశ్‌తో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న భార బ్యాటర్లు పరుగుల సునామీ చేశారు. 20 ఓవర్లలో 6 వికెట్లు మాత్రమే కోల్పోయి297 పరగులు చేశారు. సంజూ శాంసన్ 47 బంతుల్లో 111 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. By Manogna alamuru 12 Oct 2024 in స్పోర్ట్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి India Super Bating: హైదరాబాద్ ఉప్పల్‌లో టీమ్ ఇండియా, బంగ్లాదేశ్ ల మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్‌ల సీరీస్‌లో చివరి టీ20 మ్యాచ్ ఈ రోజు జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియా ఇవాళ బ్యాట్‌తో ఊచకోత సృష్టించింది. కేవలం ఆరు వికెట్లు కోల్పోయి 297 పరుగులు చేసింది. ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో ఉండిపోయింది. అంతకు ముందు నేపాల్ 314 పరుగులతో రికార్డ్‌ను నెలకొల్పింది. అయితే దాని తరువాత స్థానం మాత్రం ఇప్పుడు కచ్చితంగా భారత జట్టుదే. ఇంతకు ముందు కూడా టీమ్ ఇండియానే ఈస్థానంలో ఉంది. 2017లో శ్రీలంక మీద 260 పరుగులు చేసింది భారత జట్టు. ఇక ఈరజు మ్యాచ్ విషయానికి వస్తే..భారత బ్యాటర్లు విజృంభించారనే చెప్పాలి.మొదట బ్యాటింగ్‌కు దిగిన అభిషేక్ శర్మ కేవలం నాలుగు పరుగులే చేసి అవుట్ అయ్యాడు. అయితేఇతనితో పాటూ క్రీజ్‌లోకి వచ్చి సూర్య కుమార్ యాదవ్ 65 పరుగులు చేసి బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆ తరువాత వచ్చిన సంజూ అయితే వాళ్ళ నోట మాట పడిపోయి..కళ్లు అప్పగించేలా స్ట్రోక్స్ ఇచ్చాడు. రిషద్ వేసిన పదో ఓవర్‌లో సంజూ ఏకంగా 30 పరుగులు రాబట్టాడు. ఒక్క బంతి తప్ప ఆ ఓవర్‌లో అన్ని బంతులనూ సిక్సర్ల బాట పట్టించాడు. మొత్తం మ్యాచ్ అంతా ఇలానే ఆడుతూ 40 బంతుల్లో సెంచరీ కూడా పూర్తి చేసేశాడు. మ్యాచ్ ముగిసేసరికి సంజూ శాంసన్ 111, 47 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లు, సూర్య కుమార్ యాదవ్ 75, 35 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సులు కొట్టారు. ఆఖర్లో రియాన్ పరాగ్ 34, హార్దిక్ పాండ్య 47 పరుగులు రాబట్టారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి టీమ్ ఇండియా 297 పరుగులు చేసింది. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి