మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో అనేది తెలిపోయింది. ప్రస్తుతం మహారాష్ట్రలో మహాయతి కూటమి మేజిక్ ఫిగర్‌ను దాటి 219 స్థానాల్లో అధిక్యంలో దూసుకుపోతోంది. ఇక మహా వికాస్ అఘాడి కేవలం 48 స్థానాలకే పరిమితమైపోయింది. ఇక ఇతరులు 21 స్థానాల్లో మెజార్టీలో ఉన్నారు. మొత్తానికి మహారాష్ట్రంలో మహాయుతి కూటమి అధికారంలోకి వచ్చినట్లేనని స్పష్టమవుతోంది.
ఝార్ఖండ్‌లో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. అక్కడ ఇండియా కూటమి మేజిగ్ ఫిగర్‌ను దాటి 52 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది. ఎన్డీయే కూటమి కేవలం 28 స్థానాల్లోనే మెజార్టీలో ఉంది. ఇక్కడ చూస్తే.. ఝార్ఖండ్‌లో ఇండియా కూటమి అధికారాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు క్లారిటీ వచ్చేసింది.