/rtv/media/media_files/2025/02/21/VNwTi9eywaAsdpgcKKSS.webp)
rakhi-sawant--ranveer-allahbadia
Rakhi Sawant : ఇండియాస్ గాట్ లాటెండ్ షో ప్రాడ్‌కాస్టర్ రణవీర్ అలహాబాదియా వివాదా స్పద వ్యాఖ్యల వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. ఆ కేసు అటు తిరిగి ఇటు తిరిగి గతంలో ఆ షోలో పాల్గొన్నవారి చుట్టూ తిరుగుతుంది. వారి నుంచి వివరాలు సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. తాజాగా టీవీ హోస్ట్, మోడల్, నటి రాఖీ సావంత్ కు పోలీసులు సమన్లు జారీ చేశారు. మహారాష్ట్ర సైబర్ పోలీసులు ఈ సమన్లు జారీ చేశారు. ఆమె వాంగ్మూలం నమోదు చేసేందుకు ఫిబ్రవరి 24న తమ ముందు హాజరుకావాలని కోరారు. దీనికి కారణం ఆమె అంతకు ముందు ఇండియా గాట్ లాటెంట్ షో లో పాల్గొనడమే అని తెలుస్తుంది.
Also Read: మరో మీర్ పేట మర్డర్.. 20 ఏళ్లుగా ఫ్రిజ్ లోనే పుర్రె, అస్థి పంజరం.. ఆ డెడ్ బాడీ ఎవరిది?
రాఖీసావంత్ గత ఏడాది అక్టోబర్‌లో ఢిల్లీలో జరిగిన "ఇండియా గాట్ లాటెంట్''షోలో పాల్గొన్నారు. ఆ షోలో కో-జడ్జి మహీప్ సింగ్, రాఖీ సావంత్ మధ్య తారా స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఓ దశలో రాఖీ సావంత్ వేదికపై ఉన్న కూర్చీని విసిరి కొట్టారు. దీనికి సంబంధించిన ఫుటేజీ ఆన్‌లైన్‌లో రావడంతో ఒక్కసారిగా వైరల్ అయింది. మహీప్ సింగ్ కొన్ని ''కుళ్లు జోకులు'' వేయడం, రాఖీ పదేపదే అడ్డుపడటంతో షో రసాభాసగా మారింది. ఇది తీవ్రస్థాయికి చేరుకోవడంతో షో పూర్తికాకుండానే అర్థాంతరంగా ముగిసింది.
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీ కొట్టిన బస్సు.. స్పాట్‌లోనే 9మంది మృతి!
కాగా, ఇటీవల జరిగిన 'ఇండియాస్ గాట్ లాటెండ్'షోలో రణ్‌వీర్ అలహాబాదియా ఓ వ్యక్తిని తల్లిదండ్రుల గురించి, శృంగారంపైన ప్రశ్నించి వివాదంలో చిక్కుకున్నారు. దీనిపై ముంబై పోలీసులుకు ఫిర్యాదులు అందాయి. మహారాష్ట్ర మహిళా కమిషన్ సైతం మండిపడింది. దీంతో ఇటు ముంబైతో పాటు అసోం పోలీసులు సైతం రణవీర్‌పై ఎఫ్ఐర్‌లు నమోదయ్యాయి. తన వ్యాఖ్యలకు రణ్‌వీర్ క్షమాపణలు చెప్పినప్పటికీ దుమారం తగ్గలేదు. పలు రాష్ట్రాల్లో ఎఫ్ఐఆర్‌లు నమోదు కావడంతో ఆయన నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు ప్రాణభయం ఉందని, వివిధ చోట్ల నమోదైన ఎఫ్ఆర్‌లను ఒకేచోట చేర్చి విచారించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. మీరు మాట్లాడిన మాటలు వ్యక్తిగత స్వేచ్ఛ పరిధిలోకి వస్తుందా? బుర్రలేని కుళ్లును బయటపెట్టారంటూ తీవ్రంగా మందలించిన అత్యున్నత న్యాయస్థానం ఆయనను విదేశాలకు వెళ్లరాదని, పాస్‌పోర్ట్ సరెండర్ చేయాలని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ రణ్‌వీర్, ఆయన అసోసియేట్లు యూట్యూబ్‌లో కానీ, ఇతర వేదికలపై కానీ ఎలాంటి షోలు ప్రసారం చేయరాదని ఆంక్షలు విధించింది. కాగా. లాటెండ్ షోతో సంబంధం ఉన్న పలువురి స్టేట్‌మెంట్లను మహారాష్ట్ర పోలీసులు ఇప్పటికే రికార్డు చేశారు.