మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు 8 రోజులు కావొస్తున్నా.. ఇంకా కొత్త ప్రభుత్వం కొలువుదీరలేదు. భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన మహాయుతి కూటమి నుంచి సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై ఇంకా క్లారిటీ రాకపోవడం ఉత్కంఠగా మారింది. కూటమి లోని ప్రధాన పక్షాలైన ఎన్సీపీ, శివనేన పార్టీల అధినేతలు సీఎం ఎంపిక బాధ్యతను బీజేపీకే అప్పగించారు. దీంతో ఆ పార్టీ సీఎం ఎంపికపై తర్జనభర్జన పడుతోంది. వస్తవానికి మరాఠాల నాయకుడైన శివసేన అధినేత ఏక్ నాథ్ షిండేను మళ్లీ సీఎంగా చేయాలని బీజేపీ భావించింది. అయితే.. అందుకు ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ నో చెప్పడంతో సీన్ రివర్స్ అయ్యింది. దీంతో బీజేపీ నుంచే సీఎం అభ్యర్థి ఎంపిక కావడం అనివార్యంగా మారింది.
ఇది కూడా చదవండి: ఆ పార్టీ నుంచే సీఎం.. అజిత్ పవార్ సంచలన ప్రకటన
స్వగ్రామానికి మకాం మార్చిన షిండే..
అయితే.. ఇందుకు ఏక్ నాథ్ షిండే అంగీకరించడం లేదని తెలుస్తోంది. తనకు సీఎంగా అవకాశం ఇవ్వకపోతే ప్రభుత్వంలో కూడా చేరను అని ఆయన స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. బయట నుంచే మద్దతు ఇస్తానని ఆయన చెబుతున్నట్లు మహారాష్ట్ర రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. షిండే మకాంను రాజధాని ముంబై నుంచి తన స్వగ్రామం సతారాకు మార్చడం మహారాష్ట్ర పాలిటిక్స్ లో మరింత ఆసక్తికరంగా మారింది. ఆయనకు ఆరోగ్యం బాగాలేదని.. ట్రీట్మెంట్ తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: రైతు భరోసాపై రేవంత్ గుడ్ న్యూస్.. కీలక ప్రకటన!
బీజేపీ మాత్రం ఈ నెల 5న మహారాష్ట్ర కొత్త సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని చెబుతోంది. క్లిష్ట సమయంలో బాధ్యతలు చేపట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా తాను ప్రభుత్వాన్ని నడిపానని షిండే అంటున్నారు. కూటమి మళ్లీ అధికారంలోకి రావడంలో తన పనితీరే కారణమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తనను డిప్యూటీ సీఎంగా చేస్తే ఎలా పని చేస్తానని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.