ఆర్మీ జవాన్ గా హాస్టల్ వంటమనిషి.. మహిళతో స్నేహం చేసి ఏం చేశాడంటే!

మధ్యప్రదేశ్ కు చెందిన కపిలేష్ ఆర్మీ జవాన్ గా ఓ మహిళను ప్రేమలోకి దించాడు. పలుమార్లు అత్యాచారం చేశాడు. అతడు హాస్టల్ వంటమనిషిగా పనిచేస్తున్నట్లు గుర్తించిన మహిళ బ్రేకప్ చెప్పేసింది. ఆమె ప్రైవేట్ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

girl raped
New Update

 కొందరు యువకులు కామంతో కళ్లు మూసుకుపోయి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. నేటి సభ్య సమాజం తలదించుకునేలా మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా మహిళలే టార్గెట్ గా పెట్టుకుని పరిచయం పెంచుకుంటున్నారు.. ఆ పరిచయాన్ని ప్రేమగా మలిచి, చివరకు అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఆపై బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి మధ్యప్రదేశ్ లో జరిగింది. 

ఇది కూడా చూడండి: ఏపీకి అలర్ట్.. మరో అల్పపీడనంతో భారీ వర్షాలు

ఆర్మీ జవాన్ గా కటింగ్

తాను ఒక ఆర్మీ జవాన్ అంటూ కటింగ్ ఇచ్చాడు. అలా ఫేస్ బుక్ లో ఓ యువతిని ఫ్లట్ చేశాడు. ఆమె కూడా అతడు నిజమైన ఆర్మీ జవానే అనుకుని స్నేహం చేసింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. అనంతరం అతడు పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. అయితే ఓ రోజు ఆమెకు అసలు నిజం తెలిసింది. అతడు ఆర్మీ జవాన్ కాదని తెలియడంతో ఒక్కసారిగా షాక్ అయింది. అతడు చేస్తున్న పని తెలిసి ఆశ్చర్యపోయింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరి అతడు చేస్తున్న పనేంటో, ఎందుకు ఆమె కేసు పెట్టిందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. 

ఇది కూడా చూడండి: ఘోర ప్రమాదం.. టెంపోను బస్సు ఢీకొనడంతో 8 మంది చిన్నారులు మృతి

పలుమార్లు అత్యాచారం

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సత్నా జిల్లాలో కపిలేష్ శర్మ అనే వ్యక్తి సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ ఫేస్ బుక్ లో తాను ఆర్మీ జవాన్ గా కలరింగ్ ఇచ్చాడు. అలా ఓ మహిళతో స్నేహాన్ని పెంచుకున్నాడు. ఇద్దరూ రిలేషన్ మెయింటైన్ చేశారు. ఆ మహిళపై పలుమార్లు అత్యాచారం చేశాడు. అయితే ఓ రోజు ఆ మహిళకు అసలు నిజం తెలిసింది. అతడు ఆర్మీ జవాన్ కాదని.. ఓ ప్రైవేట్ హాస్టల్ లో వంట మనిషిగా పనిచేస్తున్నాడని ఆ మహిళ గుర్తించింది. 

ఇది కూడా చూడండి: సరికొత్త స్కానర్.. వ్యాధుల గుర్తింపు మరింత ఈజీగా..

ప్రైవేట్ ఫొటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్

దీంతో వెంటనే అతడికి బ్రేకప్ చెప్పేసింది. అయితే కపిలేష్ శర్మ అప్పటి నుంచి ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తూ వస్తున్నాడు. రిలేషన్ లో ఉన్న సమయంలో ఆమెపై పలుమార్లు అత్యాచారం చేయగా.. అందుకు సంబంధించి ఆ మహిళ ప్రైవేట్ ఫొటోలు, వీడియో తీశాడు. ఇప్పుడు వాటిని చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేయండం స్టార్ట్ చేశాడు. దీంతో భయపడిన ఆ మహిళ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే ఐపీసీ సెక్షన్ 376 సహా పలు చట్టాల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించగా.. నిందితుడు కపిలేష్ శర్మను మహారాష్ట్రలో పట్టుకున్నారు.

ఇది కూడా చూడండి: ఐదేళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు గ్యాంగ్ రేప్!

#crime-news
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe