Waqf Bill: వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం

వివాదాస్పద వక్ఫ్ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. దీనిని నిన్నంతా వాడీవేడిగా చర్చ జరిగింది. 12 గంటల సుదీర్ఘ చర్చ తర్వాత అర్ధరాత్రి బిల్లుకు ఆమోదం లభించింది.  282 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటేశారు.

New Update
Lok Sabha

వక్ఫ్ సవరణ బిల్లుకు మొత్తానికి ఆమోదం లభించింది. నిన్నంతా లోక్ సభ ఈ బిల్లుపై చర్చతో దద్దరిల్లింది. అర్ధరాత్రి వరకు సభను కొనసాగించారు. దాదాపు 12 గంటలపాటూ వక్ఫ్ సవరణ బిల్లుపై లోక్ సభలో చర్చించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత స్పీకర్ ఓం బిర్లా దీనిపై ఓటింగ్ నిర్వహించారు. సభలో 282 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేయగా, 232 మంది వ్యతిరేకించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పక్షాలు, ప్రతిపక్ష ఇండియా కూటమిలోని ప్రధాన పార్టీలు తమ ఎంపీలు అందరికీ విప్‌ జారీ చేశారు. ఈరోజు వక్ఫ్ సవరణ బిల్లును రాజ్యసభకు వెళుతుంది. అక్కడ దీనిపై చర్చకు 8 గంటల సమయాన్ని కేటాయించారు. 

చర్చలతో దద్ధరిల్లిన లోక్ సభ..

అంతకు ముందు లోక్ సభలో చాలా వాడీ వేడిగా చర్చ జరిగింది. ప్రతిపక్ష ఇండియా కూటమి, ఎంఐఎం మిగతా పార్టీల ఆరోపణలను, విమర్శలను అధికార పక్షం ఎన్డీయే కూటమి తిప్పికొట్టింది. హోంశాఖ మంత్రి అమిత్ షా, మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజులు గట్టిగా జవాబులు చెప్పారు.  అధికార, విపక్ష సభ్యుల వాద ప్రతివాదాలతో సభ ప్రతిధ్వనించింది. బీజేపీకి జేడీయు, శివసేన, లోక్ జనశక్తి పార్టీలు మద్దతునిచ్చాయి. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ బిల్లుపై తీవ్ర వ్యతిరేకతను ప్రకటిస్తూ ప్రతిని చింపేశారు. 

today-latest-news-in-telugu | lok-sabha | Waqf Bill 2025

Also read :  Teacher crime: ముద్దులు పెడుతూ డబ్బులు వసూలు.. లేడీ టీచర్ అరాచకాలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు