Lawrence Bishnoi Gang: బిహార్ ఎంపీ పప్పు యాదవ్‌కు లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ మాస్ వార్నింగ్ ఇచ్చింది. సల్మాన్‌కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంతో వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తనపై నిఘా ఉందని.. సల్మాన్ ఖాన్‌కు దూరంగా ఉండకపోతే.. చంపేస్తామంటూ పప్పు యాదవ్‌కు వార్నింగ్ ఇచ్చారు.
మాట వినకపోతే చంపేస్తాం
తమ మాట వినకపోతే జరగాల్సిందే జరుగుతుందని వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం గుజరాత్ సబర్మతి జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్.. జైలులో జామర్లు ఆపేందుకు గంటకు రూ.లక్ష చెల్లిస్తున్నాడని అతని అనుచరుడు చెప్పినట్లు తెలుస్తోంది. కాగా దీనికి సంబంధించి ఎంపీ పప్పు యాదవ్ కేంద్రం నుండి భద్రతను కోరాడు.
Also Read: దీపావళి ధమాకా.. బిగ్ బాస్ లో సెలెబ్రెటీల సందడి.. ప్రోమో చూసేయండి
గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తోంది. మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్య తర్వాత బిష్ణోయ్ పేరు మరింత మారుమోగిపోయింది. సల్మాన్ ఖాన్‌తో సన్నిహితంగా ఉండటంతోనే బాబా సిద్దిఖీని హత్య చేసినట్లు ఆ గ్యాంగ్ ప్రకటించుకుంది. అయితే ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read : అల్లు అర్జున్ కు తెలంగాణ పోలీసుల ఎదురుదెబ్బ..'పుష్ప2' కు ఊహించని షాక్?
వారికి బిష్ణోయి గ్యాంగ్‌తో సంబంధాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. మరోవైపు లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం గుజరాత్ సబర్మతి జైలులో ఉన్నాడు. అయినా వార్నింగ్‌లు రావడం ఆగడం లేదు. ఈ ఏడాది బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపిన కేసులో లారెన్స్ బిష్ణోయ్ పేరు గట్టిగా వినిపించింది.
Also Read : తెలుగు స్టార్ హీరోలపై సూర్య షాకింగ్ కామెంట్స్.. ఒక్కొక్కరి గురించి ఒక్కోలా?
బిష్ణోయ్ గ్యాంగ్ లోని ముగ్గురు గ్యాంగ్‌స్టర్లు కార్యకలాపాలు చూసుకుంటున్నారు. వారిలో బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ ఒకరు కాగా.. గోల్డిబ్రార్, రోహిత్ గోదర్ ఉన్నారు. సల్మాన్‌తో సన్నిహితంగా ఉన్న ప్రతీ ఒక్కరినీ చంపేస్తామంటూ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు కూడా వచ్చాయి. మొన్నటికి మొన్న బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు మరోసారి చంపేస్తాం అంటూ బెదిరింపులు రావడం తీవ్ర కలకలం సృష్టించింది.
Also Read: డిజిటల్ అరెస్టుల్లో రూ.120 కోట్లు పోగొట్టుకున్న బాధితులు..
బిష్ణోయ్ గ్యాంగ్‌తో ఉన్న ఈ గొడవకి ఒక ముగింపు పలకాలంటే తమకు రూ.5 కోట్లు ఇవ్వాలంటూ ఇటీవల ముంబయి ట్రాఫిక్ పోలీసుల వాట్సప్ నంబర్‌కు ఒక మెసేజ్ వచ్చిన విషయం తెలిసిందే. అడిగిన మొత్తాన్ని చెల్లించకపోతే మాజీ ఎమ్మెల్యే సిద్ధిఖీ కంటే దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ వచ్చింది. అయితే ఇప్పుడు మళ్లీ బీహార్ ఎంపీకి చంపేస్తామని వార్నింగ్ రావడంతో అంతా షాక్ అవుతున్నారు.