BREAKING: మద్యం షాపులపై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం

AP: మద్యం షాపుల దరఖాస్తులకు గడువు పొడిగిస్తూ చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దసరా సెలవులతో బ్యాంకులు పనిచేయవని దరఖాస్తుదారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా.. ఈ నెల 11 వరకు దరఖాస్తులకు సమయాన్ని పొడిగించింది.

New Update
Chandrababu on Vijayawada floods

AP Liquor: మద్యం షాపులపై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో మద్యం షాపుల దరఖాస్తులకు గడువు పొడిగించింది. మద్యం టెండర్ల షెడ్యూల్‌ను మార్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దసరా సెలవులతో బ్యాంకులు పనిచేయవని ప్రభుత్వం దృష్టికి పలువురు దరఖాస్తుదారులు తీసుకెళ్లారు. వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తితో మద్యం టెండర్ల షెడ్యూల్లో మార్పులు చేసింది. ఈ నెల 11 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులకు అవకాశం ఇచ్చింది. ఈనెల 14న మధ్యం షాపులకు అధికారులు లాటరీ తీయనున్నారు. ఈనెల 16 నుంచి కొత్త మద్యం విధానం అమలు కానుంది.

3,396 మద్యం దుకాణాలకు...

ఇటీవల కొత్త లిక్కర్ పాలసీ విధానాన్ని ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. మొత్తం 3,396 మద్యం దుకాణాలకు లైసెన్సుల జారీకి అక్టోబర్ 1నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించింది. అక్టోబరు 12 నుంచి 2026 సెప్టెంబరు 30 వరకూ ఈ విధానం అమల్లో ఉండబోతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు దరఖాస్తుదారులు ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ ద్వారా అప్లై చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఒక్కో టెండర్ రూ.2 లక్షలు చొప్పున నాన్‌ రిఫండబుల్‌ ఫీజు చెల్లించాల్సివుండగా.. ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవడానికి అవకాశం కల్పించింది.

ఇక డెబిట్, క్రెడిట్‌ కార్డు లేదా బ్యాంకు చలానా ద్వారా ఫిజు చెల్లించాలని సూచించింది. డీడీ ఎక్సైజ్‌ స్టేషన్లలో తప్పనిసరిగా ఇవ్వాలని తెలిపింది. కాగా తొలుత జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అక్టోబర్ 11న లాటరీ తీసి, లైసెన్సులు కేటాయించాలని... అక్టోబర్ 12న లైసెన్సు దారులు కొత్త దుకాణాలు తెరుచుకోవచ్చని తెలిపింది. తాజాగా దరఖాస్తుల గడువును చంద్రబాబు సర్కార్  పొడిగించింది.

Advertisment
తాజా కథనాలు