మమతా బెనర్జీ అబద్ధం చెబుతున్నారు..కోలకత్తా ట్రైనీ డాక్టర్ తల్లి

కోలకత్తా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు ఇంకా ఏమీ తేలలేదు. పైగా రోజుకో మలుపు తిరుగుతోంది కూడా. ఇప్పటికే నిందితులను కాపాడ్డానికి  మమతా ప్రభుత్వం, పోలీసులు ప్రయత్నించారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు బాధితురాలి తల్లి కూడా కేసు దర్యాప్తును అణచివేయడానికి ప్రయత్నించారని అంటున్నారు. 

New Update
mamata banerjee

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అబద్ధాలు చెబుతున్నారంటున్నారు కోలకత్తా ట్రైనీ డాక్టర్, బాధితురాలి తల్లి. తమ కూతురి కేసు దర్యాప్తును అణిచివేసేందుకు ప్రయత్నించారంటూ అమ్మాయి తల్లిదండ్రులు ఆరోపించారు. దాని కోసం తమకు పరిహారం ఇస్తామన్నారని కూడా చెప్పారు. 

అయితే బాధితురాలి తల్లిదండ్రుల ఆరోపణలను దీదీ ఖండించారు. ఈ దుష్ప్రచారం తమ ప్రభుత్వం పరువు తీసేందుకు జరుగుతున్న కుట్ర అని అన్నారు. పైగా రాష్ట్రంలో అత్యాచారం, హత్య ఘటనపై నిరసనను ఆపాలని మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. అలాగే దుర్గాపూజ ఉత్సవాలకు సిద్ధం కావాలని సీఎం ప్రజలను కోరింది.  కానీ బాధితురాలి తల్లి మాత్రం పదేపదే ఒకటే మా చెబుతున్నారు. మీకు నష్టపరిహారం ఇస్తామని, మీ కుమార్తె జ్ఞాపకంగా ఏదైనా తయారు చేయిస్తానని ముఖ్యమంత్రి చెప్పారని అంటున్నారు. అయితే.. నేను మాత్రం నా కుమార్తెకు న్యాయం జరిగినప్పుడు మీ కార్యాలయానికి వచ్చి పరిహారం తీసుకుంటానని చెప్పానని తల్లి అంటున్నారు. తమ కూతురుకి ఇంకా న్యాయం జరగలేదని..కానీ రాష్ట్రం మాత్రం పండగ చేసుకోవడానికి తయారయిందని అన్నారు. ఒక ఆడపిల్లకు తల్లిగా దీనిని ఖండిస్తున్నాని ఆమె అన్నారు. నా కూతురితో దుర్గాపూజ చేసకునే నాకు ఇప్పుడు జీవితంలో చీకటి ఏర్పడిందని అన్నారు.  

Advertisment
Advertisment
తాజా కథనాలు