గుండు సూది నుంచి గూడ్స్ రైలు ఇంజన్స్ తయారీ వరకు.. అయినా టాటా నం.1 సంపన్నుడు కాదు.. ఎందుకో తెలుసా!?

161 కంపెనీలు.. గుండు సూది నుంచి గూడ్స్ రైలు ఇంజన్ల తయారీ వరకు.. ఆసియాలో మొదటి క్యాన్సర్ ఆస్పత్రి నుంచి ఇండియాలో మొదటి ఎయిర్ లైన్స్ ప్రారంభించింది టాటాలే.. అయినా రతన్ టాటాది ప్రపంచ సంపన్న జాబితాలో మాత్రం 421వ స్థానం.. ఎందుకో ఈ ఆర్టికల్‌లో తెలుసుకోండి.

New Update
tata ratan

Ratan Tata: టాటా ఈ పేరు తెలియని భారతీయుడు ఉండదు. ఉప్పు  నుండి ఉక్కు వరకు.. టీ నుండి ట్రాక్స్ వరకు ఇలా ప్రతి దానిలో టాటా పేరు వినబడుతోంది. సుమారు 6 లక్షల కోట్ల విలువతో దాదాపు 7 లక్షల మంది ఉద్యోగులతో మన దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యంగా టాటా కంపెనీ మొదటి స్థానంలో నిలిచింది. ఇంత పెద్ద కంపెనీని విజయవంతంగ నడిపిస్తున్న వ్యక్తి రతన్ టాటా. 1937లో టాటా కుటుంబంలో టాటా గ్రూపు వ్యవస్థాపకుడు జమ్‌షెడ్జీ టాటా కు మునిమనుమడుగా జన్మించిన ఆయన నిన్న ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. 

 

కాటన్ మిల్లుగా ప్రారంభమై...

tata

తత్థ కంపెనీ మొదట ఒక చిన్న కాటన్ మిల్లుగా ప్రారంభం అయింది. జమ్‌షెడ్జీ టాటా దీనిని స్థాపించాడు. 1869లో ప్రారంభమైన ఈ కంపెనీ తరతరాలుగా చేతులు మారుతూ వచ్చింది. అసలు మన దేశంలో మొదటి సారిగా విమానాల కంపెనీని స్టార్ట్ చేసింది టాటాలే. ఇప్పుడు ఎయిర్ ఇండియా గా చెప్పుకుంటున్న ఎయిర్ లైన్స్ మొదట టాటా ఎయిర్ లైన్స్ గా ఉండేది. కానీ రెండో ప్రంపంచ యుద్ధం తరువాత అది ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయింది. ఇదెక్కొట్టే కాదు.. ఇండియాలోనే మొట్ట మొదటి హోటల్ తాజ్ హోటల్ ను స్థాపించింది కూడా టాటాలే. టాటా గ్రూప్స్ గురించి ప్రస్తావించే సమయంలో మనం పక్కాగా చెప్పుకునే పేరు రతన్ టాటా. ఇప్పుడు ఆయన గురించి తెలుసుకుందాం.

రతన్ టాటా తండ్రి అనాధ...

ratan tata grand mother

రతన్ టాటా డిసెంబర్ 28 1937లో దేశంలోనే ఓకే ధనిక కుటుంబంలో జన్మించారు. ఈయనకు పదేళ్ల వయసు ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు విడిపోవడంతో వాళ్ళ నానమ్మ దగ్గర పెరిగాడు. కాగా వాస్తవానికి రతన్ టాటా.. టాటా వారసుడు కాదు. ఆయన ఒక అనాధ కొడుకు. టాటా గ్రూపు వ్యవస్థాపకుడు జంషెట్ టాటా. జంషెట్ టాటా కొడుకు రతన్ జంషెట్ టాటా. రతన్ జంషెట్ టాటాకి పిల్లలు లేకపోతే నావల్ అనే వ్యక్తిని పెంచుకొని నావల్ టాటా అని పేరు పెట్టుకున్నారు. నావల్ టాటా కొడుకే రతన్ టాటా. టెక్నికల్‌గా టాటాల వారసుడు రతన్ టాటానే, కానీ నిజానికి రతన్ టాటా ఒక అనాధ కొడుకు.

రతన్ తండ్రి నావల్‌ది గుజరాత్ రాష్ట్రం సూరత్‌లోని దిగువ మధ్య తరగతి కుటుంబం. 4 ఏళ్ల వయస్సులోనే అతని తండ్రి చనిపోతే తల్లి కుట్టు మిషిన్‌తో వచ్చేదానితో పోషించలేక నావల్‌ని ఒక అనాధాశ్రమంలో చేర్పించారు. పిల్లలు లేని రతన్ జంషెట్ టాటా భార్య నావల్‌ని దత్తత తీసుకోవటం వలన నావల్ కాస్తా నావల్‌ టాటా అయ్యాడు. 

చిన్నతనంలోనే తల్లిని కోల్పోయాడు..

ratan father

నావల్ టాటా, సోను అనే అమ్మాయిని పెండ్లి చేసుకున్నాడు. వీరికి రతన్ టాటా పుట్టాక కొన్ని రోజులకే విడిపోయారు. ఆ తర్వాత నావల్ టాటా స్విట్జర్లాండ్ అమ్మాయిని పెండ్లి చేసుకున్నాడు. సంపన్నుల కుటుంబంలోకి వచ్చిన రతన్ టాటాకు ఏ ఇబ్బంది లేదు. గోల్డెన్ స్పూన్ తో పెరిగాడు అనుకుంటాం. కానీ చిన్నతనంలోనే తల్లిని కోల్పోయాడు, తను ఆర్కిటెక్ట్ అవుదాం అనుకుంటే తండ్రి ఇంజనీరింగ్ చేయమనేవాడు. తను అమెరికా వెళ్ళి విద్యాభ్యాసం చేయాలనుకుంటే తండ్రి ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకోమనేవాడు. చివరికి తాత రతన్ జంషెట్ టాటాని ఒప్పించి అమెరికాలోని కార్నెగీ యూనివర్శిటీలో చదువుకున్నాడు. 

పెళ్లి అందుకే చేసుకోలేదు..

young ratan

అమెరికాలో చదువుకునే రోజుల్లో ప్రేమించిన అమ్మాయిని పెండ్లి చేసుకుందాం అనుకున్నాడు. కానీ గ్రాండ్ పేరెంట్స్ ఆరోగ్యం బాగాలేకపోతే ఇండియా తిరిగి వచ్చాడు. ఆ సమయంలో ఇండియా చైనా యుద్ధం జరుగుతుండటంతో రతన్ టాటాని చేసుకోటానికి ఆ అమ్మాయి ఇండియా రాలేదు, వేరే వాళ్ళని చేసుకుంది. ఆ తర్వాత ఎవరిని చూసినా ఆ అమ్మాయే గుర్తు వచ్చిందో ఏమో రతన్ టాటా పెండ్లి చేసుకోలేదు. బ్రహ్మచారిగానే రతన్‌ టాటా చనిపోయారు.

1970లో వ్యాపారాల్లోకి ఎంట్రీ....

tata entry

టాటా గ్రూపు వ్యవస్థాపకుడు జంషెట్ టాటా కజిన్ బ్రదర్ కొడుకు JRD టాటా. రతన్ టాటా ఇండియా వచ్చిన సమయంలో JRD టాటానే టాటా గ్రూపు వ్యాపారాలని చూసుకునేవాడు. రతన్ టాటా కూడా మామూలు ఉద్యోగిలాగే టాటా గ్రూపులో జాయిన్ అయ్యాడు. JRD టాటా ఆరోగ్యం బాగాలేని స్థితిలో రతన్ టాటాకి... టాటా గ్రూపు పగ్గాలు 1970లో అప్పగించాడు. అప్పటిదాకా కుటుంభ వ్యాపారంలాగా ఉన్న టాటా సంస్థని అంతర్జాతీయ సంస్థగా తీర్చిదిద్దాడు రతన్ టాటా. ఇండియాలో ఉన్నకార్లు, విమానాలు అన్నిటినీ కొనగలడు కానీ ఇప్పటికీ ఆయన కారుని ఆయనే డ్రైవ్ చేసుకుంటూ వెళతాడు రతన్ టాటా. తన సొంత సంస్థల్లోకి వెళుతుంటే అందరిలాగే తప్పనిసరిగా ఆగి తన కారుని చెక్ చేపించుకుంటాడు. కాగా తన 75 ఏటా ఛైర్మన్ పదవి నుంచి వైదొలిగారు రతన్ టాటా.

టాప్ ధనవంతుల జాబితాలో లేడు...

s

రిలయన్స్, బిర్లా, బజాజ్ లాంటి వారి అందరి సంపద కంటే టాటా గ్రూపు సంపద ఎక్కువ. కానీ అంబానీ, అదానీలాగా ఇండియాలో కానీ, ప్రపంచంలో కానీ టాప్‌లో లేడు రతన్ టాటా. దాదాపు 160కి పైగా కంపెనీలు కలిగిన రతన్ టాటా.. ప్రపంచంలో సంపన్నుల జాబితాలో 421 స్థానంలో ఉన్నారు. ఇందుకు కారణం ఆయన సంపదలో 60% ఎప్పుడూ దాన ధర్మాలకి వినియోగించడమే. ఆసియాలో మొదటి క్యాన్సర్ హాస్పటల్ నుంచి ఇండియాలో మొదటి ఎయిర్ లైన్స్ వరకు టాటాలే ప్రారంభించారు. టీ పొడి, ఉప్పు నుంచి ఫైవ్ స్టార్ హోటల్స్ వరకు టాటాలు లేని వ్యాపారం లేదు. సిగరెట్స్, ఆల్కహాల్ వ్యాపారం తప్ప. గుండు సూది నుంచి గూడ్స్ రైలు ఇంజన్స్ వరకు టాటా లే నంబర్ వన్. 

ఎగతాళి చేసిన వారే...

tata ford

టాటా ఇండికా వచ్చిన కొత్తలో నష్టాల్లో ఉంటే అమెరికాకి చెందిన ఫోర్డ్ మోటార్స్ కి వెళ్ళి అమ్ముతాం కొనమని అడిగితే వాళ్ళు ఎగతాళి గా మాట్లాడి పంపించినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అదే ఫోర్డ్ మోటార్స్ నష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు సాదరంగా ఆహ్వానించి ఫోర్డ్ వాళ్ళ లగ్జరీ కార్లు అయిన "జాగ్వార్", "లాండ్ రోవర్" ని 2008లో కొని ఫోర్డ్ మోటార్స్ కి సహాయం చేశాడు రతన్ టాటా.

మధ్యతరగతి వారికోసం..

tata car

మధ్యతరగతి వారు కారు కొనలేని స్థితిలో ఉన్నప్పుడు వారికి కూడా తక్కువ ధరలో కారు కొనేలా చేయాలనే ఉద్దేశ్యంతో రతన్ టాటా 2015లో టాటా నానో కారును భారత్ ఆటో మొబైల్ మార్కెట్ లోకి తెచ్చాడు. కేవలం రూ.1 లక్షకే ఈ కారును మార్కెట్ లో లాంచ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా మధ్య, దిగువ-మధ్య-ఆదాయ వినియోగదారులకు అత్యంత సరసమైనదిగా మారింది. ఐదుగురు కూర్చునే సామర్థ్యం కలిగిన ఈ కారు ప్రారంభ ధర 2వేల డాలర్లు. టాటా నానో అనేది స్థోమత పరంగా సామాన్యుల కారుగా పేరుగాంచింది.

దేశానికి ఆపద వస్తే...

ratan pilot

సేవాగుణంలో టాటాకు టాటానే సాటి. కరోనా సమయంలో దేశం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో టాటా సంస్థ తన విశాల హృదయాన్ని చాటుకుంది. మహమ్మారిపై పోరు కోసం 1500 కోట్ల భారీ విరాళాన్ని ఇస్తున్నట్లు రతన్‌ టాటా ప్రకటించారు. అత్యంత కఠినమైన సవాలు మానవాళి ఎదుర్కొంటోంది. ఈ సంక్షోభ సమయంలో కొవిడ్-19పై పోరాటానికి అత్యవసర వనరులను సమకూర్చాల్సి ఉంది. వైరస్ ప్రభావానికి గురైన అన్ని వర్గాలను ఆదుకోవడానికి టాటా ట్రస్టు కట్టుబడి ఉంది. రోగులకు ముందుండి సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ కవచాలు, నానాటికీ పెరుగుతున్న రోగులకు కృత్రిమ శ్వాస అందించి తగిన చికిత్స చేయడానికి అవసరమైన పరికరాలు, పరీక్షల సంఖ్య పెంచడానికి అనువైన టెస్టింగ్ కిట్లు, రోగులకు ఆధునిక సౌకర్యాలు అందించడానికి, సాధారణ ప్రజలు, ఆరోగ్య కార్యకర్తలకు అవసరమైన అవగాహన కల్పించడానికి రూ.500 కోట్లు ఖర్చుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం" అని రతన్ టాటా తన ప్రకటనలో స్పష్టంచేశారు.

అవార్డ్స్, డాక్టరేట్స్..

ratan awards

* భారత ప్రభుత్వం 2000లో రతన్ టాటా చేసిన విశేష సేవలు గుర్తించి పద్మభూషణ్ తో సత్కరించింది. 
* 2006లో మహారాష్ట్ర సర్కార్ మహారాష్ట్ర భూషణ్ బిరుదు ఇచ్చి గౌరవించింది.
* 2008లో రతన్ టాటా కు భారతదేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ వచ్చింది.\
* 2014లో హానరరీ నైట్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద బ్రిటీష్ అంపైర్ పురస్కారం క్వీన్ ఎలిజబెత్ నుంచి అందుకున్నారు
* 2023లో ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా అందుకున్నారు
*లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ, ఒహియో స్టేట్ యూనివర్శిటీ, ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్ ఐఐటి ఖరగ్‌పూర్‌తో సహా పలు ప్రతిష్టాత్మక సంస్థల నుంచి గౌరవ డాక్టరేట్‌లను కూడా అందుకున్నారు.

రతన్ టాటాకు సంబంధించిన కొన్ని ప్రత్యేక విషయాలు...

ratan

* రతన్ టాటాకు పని అంటే పూజ. పనిని గౌరవించినప్పుడే మంచి జరుగుతుందని అన్నారు.
* ఆయన ఎల్లప్పుడూ ప్రశాంతంగా, సౌమ్యంగా ఉంటాడు. కంపెనీలోని చిన్న చిన్న ఉద్యోగులను కూడా ప్రేమగా కలుసుకునేవాడు, వారి అవసరాలను అర్థం చేసుకుని, వారికి అన్ని విధాలా సహాయం చేసేవాడు.
* ప్రముఖ బిలియనీర్ రతన్ టాటా ఏదైనా పనిలో విజయం సాధించాలంటే ఆ పనిని ఒంటరిగా ప్రారంభించవచ్చని, అయితే దానిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలంటే ప్రజల మద్దతు అవసరమని చెప్పేవారు. కలిసి మాత్రమే మనం చాలా దూరం వెళ్ళగలము అని ఉద్యోగులను మోటివేట్ చేసేవారు.
* రతన్ టాటాకు జంతువులంటే, ముఖ్యంగా వీధికుక్కలంటే చాలా ఇష్టం. అతను అనేక స్వచ్ఛంద సంస్థలకు, జంతు సంరక్షణ కేంద్రాలకు కూడా విరాళాలు ఇచ్చేవాడు.
* ఆర్థిక సంక్షోభంలో ఉన్న విద్యార్థులను ఆదుకోవడంలో రతన్ టాటా కూడా ముందున్నారు. అతని ట్రస్ట్ అటువంటి విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను ఇస్తుంది. అలాంటి విద్యార్థులకు JN టాటా ఎండోమెంట్, సర్ రతన్ టాటా స్కాలర్‌షిప్, టాటా స్కాలర్‌షిప్ ద్వారా సహాయం అందించబడుతుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు