/rtv/media/media_files/2025/01/14/wvkOYEMVZ6zvr1O2Kj7C.jpg)
Minister Laxmi Hebbalkar Photograph: (Minister Laxmi Hebbalkar )
కర్ణాటక మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారు బెలగావి శివార్లలో చెట్టును బలంగా ఢీకొనింది. జనవరి 13వ తేదీ సాయంత్రం బెంగళూరులో జరిగిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్‌పి) సమావేశానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. కిత్తూరు సమీపంలోని హైవేపై తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో కుక్క రోడ్డును దాటుతుండగా.. దాన్ని తప్పించేందుకు కారును టర్న్ చేయడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం, టయోటా ఇన్నోవా హైక్రాస్ పూర్తిగా దెబ్బతింది.
ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోవడంతో మంత్రికి ప్రాణాపాయం తప్పింది. ఈ కారులో మంత్రితో పాటుగా ఆమె సోదరుడు, ఎమ్మెల్సీ చన్నరాజ్ హత్తిహోళి కూడా ఉన్నారు. కారులో వెనుక కూర్చున్న మంత్రి లక్ష్మీకి ముఖం, వీపుపై గాయాలు కాగా, చన్నరాజ్ హత్తిహోళి ముఖంపై గాయాలయ్యాయి. ఇద్దరినీ వెంటనే విజయా ఆసుపత్రిలో చేర్పించారు, అక్కడ ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ డాక్టర్ రవి పాటిల్ వారికి చికిత్స అందిస్తున్నారు.
#WATCH | Karnataka Minister Laxmi Hebbalkar brought to a private hospital after meeting with an accident near Belagavi. According to her son, she has sustained minor injuries on her back and face. pic.twitter.com/3XxeqnVzMa
— ANI (@ANI) January 14, 2025
మరో రెండు రోజుల్లో డిశ్చార్జ్
ఇక ఈ ఘటనలో గాయపడిన డ్రైవర్, ఆమె గన్‌మ్యాన్‌లను ప్రథమ చికిత్స తర్వాత డిశ్చార్జ్ చేశారు. ఇక మంత్రిని మరో రెండు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని డాక్టర్లు వెల్లడించారు. ఎస్పీ డాక్టర్ భీమశంకర్ గులేద్ సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ విషయం తెలియగానే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, రాష్ట్ర హోంమంత్రి డాక్టర్ జి పరమేశ్వర్‌లు లక్ష్మి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆమె ఆరోగ్యంపై ఆరా తీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా లక్ష్మీ హెబ్బాల్కర్ ఉన్నారు.
Also Read : ఓటమి ఎఫెక్ట్ : టీమిండియా ఆటగాళ్లకు బిగ్ షాక్ ఇచ్చిన బీసీసీఐ