Karnataka: రేణుకాస్వామి హత్య కేసులో ముగ్గురికి బెయిల్ కర్ణాటకలో సంచలనం సృష్టించిన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో బెంగళూరు కోర్టు ముగ్గురికి షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. దాంతో పాటూ వీరిపై హత్యా నేరం కూడా ఎత్తివేస్తూ న్యాయమూర్తి జైశంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. By Manogna alamuru 23 Sep 2024 in నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Renuka Swamy Murder Case: కన్నడ నటుడు దర్శన్ కు రేణుకాస్వామి వీరాభిమాని. అయితే తన ఫేవరెట్ హీరో మరో నటి పవిత్రా గౌడ్‌తో సంబంధాలు పెట్టుకోవడం నచ్చక...ఆమెకు అసభ్యకరమైన సందేశాలు పంపించాడు. ఎంత చెప్పినా ఆపలేదు. దీంతో హీరో దర్శన్ ఆగ్రహానికి గురై..రేణుకాస్వామిని హత్య చేయించాడు. ఈ కేసులో దర్శన్ , పవిత్ర తో పాటూ మొత్తం 17మంది దోషులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వీరిలో ముగ్గురికి బెంగళూరు కోర్టు ఈరోజు బెయిల్‌ను మంజూరు చేసింది. దాంతో పాటూ వారి మీద హత్యానేరం కూడా ఎత్తేసింది. నిందితుడు కేశవ్ మూర్తికి కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరో ఇద్దరు నిందితులు కార్తీక్, నిఖిల్‌లకు కూడా బెంగళూరు సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వీరికి షరతులతో కూడిన బెయిల్ ఇస్తూ.. న్యాయమూర్తి జైశంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. మిగతా వారందరూ రాష్ట్రంలో పలు జైళ్ళల్లో ఉన్నారు. ఈ కేసులో పోలీసులు సెప్టెంబర్ 4న కోర్టులో 3,991 పేజీల ప్రాథమిక చార్జిషీట్ దాఖలు చేశారు. పవిత్ర, దర్శన్ ఇద్దరూ ఒకే జైలులోనే ఉన్నారు. అయితే ఆ మధ్య పరప్పన జైల్లో ఉన్న దర్శన్‌కు రాచమర్యాదలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు వచ్చాయి. దానికి సంబంధించిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అందులో దర్శన్ సిగరెట్ తాగుతూ, ఫోన్‌లో మాట్లాడుతున్నట్టు ఉంది. దీంతో దర్శన్‌ను పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుంచి బళ్లారి జైలుకు మార్చారు. జూన్ 11న వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. Also Read: Badlapur:బద్లాపూర్ లైంగిక ఆరోపణల నిందితుడు మృతి..పోలీస్ కాల్పుల్లో హతం మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి