/rtv/media/media_files/xKnq6ePalybIqmajMIz3.jpg)
Badlapur Sexual Assault Case:
మహారాష్ట్రలోని థానే జిల్లా బద్లాపూర్‌లో ఓ స్కూల్లో స్వీపర్ అక్షయ్ ఇద్దరు బాలికలను లైంగికంగా వేధించిన ఘటన సంచలనం సృష్టించింది. అప్పుడు ఇది చాలా పెద్ద గొడవే అయింది. నిందితుడిని పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. అయినా సరే అతడికి వెంటనే శిక్ష వేయాలంటూ తల్లిదండ్రులు, బంధువులు బద్లాపూర్ రైల్వే స్టేషన్ లో ఆందోళన చేశారు. రైలు పట్టాలను ధ్వంసం చేయడమే కాకుండా..రైళ్ళ రాకపోకలు సాగకుండా నిరసనలు చేశారు. అయితే నిందితుడికి తొందరలోనే శిక్ష పడేలా చేస్తామని మహారాష్ట్ర గవర్నమెంట్ హామీ ఇవ్వడంతో దానిని విరమించారు.
ఇప్పుడు తాజాగా ఈరోజు బద్లాపూర్ లైంగిక ఆరోపణల నిందితుడు అక్షయ్ పోలీస్ ఎదురు కాల్పుల్లో మరణించాడు. కేసు విచారణలో భాగంగా నిందితుడిని తలోజా జైల్ నుంచి బద్లాపూర్‌కు పోలీసులు తీసుకువస్తుండగా ఈ ఘటన జరిగింది. ముందు నిందితుడు అక్షయ్.. పోలీస్ కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కుని కాల్పులు జరిపాడు. అక్షయ్ ను నివారించేందుకు పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని ఆసుపత్రికి చికిత్స కోసం తరలించిన తర్వాత అక్కడ మృతి చెందాడని పోలీసులు చెబుతున్నారు.
Also Read: Movies: తెలంగాణలో దేవర స్పెషల్ షోస్ ..టికెట్ రేట్లు ఇవే
Follow Us