Karnataka: అభయ ఘటన మరువకముందే కర్ణాటకలో మరో భయంకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. మైసూరు రోడ్డులోని కంబీపూర్ ఏసీఎస్ కాలేజీలో దారుణం చోటుచేసుకుంది. కాలేజీ అమ్మాయిల బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టి.. వేల సంఖ్యలో న్యూడ్ వీడియోలు రికార్డు చేసినట్లు అమ్మాయిలు గుర్తించారు. దీనిపై వెంటనే కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసి నిందితులను పట్టుకోవాలంటూ పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టగా ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఫోన్, ల్యాప్ టాప్ లో న్యూడ్ వీడియోలు..
ఈ మేరకు ఏసీఎస్ కాలేజీలోనే ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న కుశాల్ అనే విద్యార్థి అమ్మాయిల బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. అతని ఫోన్, ల్యాప్ టాప్ లో వేల సంఖ్యలో న్యూడ్ వీడియోలు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో డేటాను పరిశీలిస్తున్నారు. అయితే ఈ ఘటనతో కాలేజీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కుశాల్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విద్యార్థి సంఘాలు కాలేజీ వద్ద నిరసనలకు దిగాయి. అమ్మాయిల తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే... ఇటీవలే ఏపీలోని గుడ్లవల్లేరు కాలేజీలో అమ్మాయిల బాత్రూమ్ లో హిడెట్ కెమెరా ఘటన సంచలనం రేపింది. ఒక యువతి తన లవర్ కోసం.. అమ్మాయిల బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టినట్లు ప్రచారం జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు ఘటనను సీరియస్ గా తీసుకుని నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.