గర్ల్స్ బాత్రూమ్లో సీక్రెట్ కెమెరా.. వేల సంఖ్యలో న్యూడ్ వీడియోలు! కర్ణాటకలో మరో భయంకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కంబీపూర్ ఏసీఎస్ కాలేజీ అమ్మాయిల బాత్రూమ్లో కుశాల్ అనే విద్యార్థి సీక్రెట్ కెమెరాలు పెట్టి వేల సంఖ్యలో న్యూడ్ వీడియోలు రికార్డ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. By srinivas 21 Sep 2024 in నేషనల్ క్రైం New Update షేర్ చేయండి Karnataka: అభయ ఘటన మరువకముందే కర్ణాటకలో మరో భయంకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. మైసూరు రోడ్డులోని కంబీపూర్ ఏసీఎస్ కాలేజీలో దారుణం చోటుచేసుకుంది. కాలేజీ అమ్మాయిల బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టి.. వేల సంఖ్యలో న్యూడ్ వీడియోలు రికార్డు చేసినట్లు అమ్మాయిలు గుర్తించారు. దీనిపై వెంటనే కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసి నిందితులను పట్టుకోవాలంటూ పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టగా ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఫోన్, ల్యాప్ టాప్ లో న్యూడ్ వీడియోలు.. ఈ మేరకు ఏసీఎస్ కాలేజీలోనే ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న కుశాల్ అనే విద్యార్థి అమ్మాయిల బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. అతని ఫోన్, ల్యాప్ టాప్ లో వేల సంఖ్యలో న్యూడ్ వీడియోలు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో డేటాను పరిశీలిస్తున్నారు. అయితే ఈ ఘటనతో కాలేజీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కుశాల్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విద్యార్థి సంఘాలు కాలేజీ వద్ద నిరసనలకు దిగాయి. అమ్మాయిల తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే... ఇటీవలే ఏపీలోని గుడ్లవల్లేరు కాలేజీలో అమ్మాయిల బాత్రూమ్ లో హిడెట్ కెమెరా ఘటన సంచలనం రేపింది. ఒక యువతి తన లవర్ కోసం.. అమ్మాయిల బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టినట్లు ప్రచారం జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు ఘటనను సీరియస్ గా తీసుకుని నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. #crime #karnataka మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి