ఉగ్రవాదులు జమ్మూకశ్మీర్‌లో ఉగ్రరూపం దాల్చారు. ఇద్దరు ఆర్మీ జవాన్లను కిడ్నాప్ చేసిన ఘటన ప్రస్తుతం సంచలనం రేపుతుంది. జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ ప్రాంతంలో ఇద్దరు టెరిటోరియల్ ఆర్మీ జవాన్లను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ అయిన ఇద్దరు జవాన్లలో ఒకరు గాయాలతో బయటపడగా.. ఇటీవల ఇంకో జవాన్ మృతదేహం లభ్యమైంది. మృతదేహంపై తుపాకీతో గాయాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కిడ్నాప్ చేసిన ఆర్మీ జవాన్లను చిత్ర హింసలు పెట్టి తుపాకులతో కాల్చినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: హైదరాబాద్‌లో సంచలనం.. భార్యని ఏసీబీకి పట్టించిన మాజీ భర్త
బుల్లెట్ గాయాలతో తప్పించుకుని..
అక్టోబర్ 8వ తేదీన ఇద్దరు ఆర్మీ జవాన్లను అటవీ ప్రాంతంలో మిలిటెంట్ కదలికలను గుర్తించడానికి పంపారు. ఆ సమయంలో ఇద్దరు జవాన్లు కిడ్నాప్‌కి గురికావడంతో అందులో ఒక జవాన్ బుల్లెట్ గాయాలతో తప్పించుకున్నాడు. కానీ ఇంకో జవాన్ వారి చేతులో చిక్కుకుపోయాడు. గాయపడిన జవాన్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
ఇది కూడా చూడండి: నష్టాలకు స్టాప్.. లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
గాయపడిన జవాన్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. మిస్ అయిన జవాన్ కోసం వెంటనే ఆ ప్రాంతంలో భద్రతా బలగాలను భారీగా ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. జవాన్ మిస్ అయిన కొన్ని గంటలకే కోకెర్‌నాగ్‌లోని అటవీ ప్రాంతంలో మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహం అనంత్‌నాగ్‌లోని ముక్ధంపోరా నౌగామ్‌కు చెందిన హిలాల్ అహ్మద్ భట్‌గా అధికారులు గుర్తించారు.