/rtv/media/media_files/2025/08/22/bharatiya-antariksh-station-module-2025-08-22-21-21-36.jpg)
Bharatiya Antariksh Station
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'భారతీయ అంతరిక్ష స్టేషన్ (BAS)'. అంతరిక్షంలో సొంతంగా స్పేస్ స్టేషన్ నిర్మించాలనే లక్ష్యంతో ఇస్రో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ క్రమంలో భారత అంతరిక్ష స్టేషన్ మొదటి మాడ్యూల్ నమూనా చిత్రాలను ఇస్రో శుక్రవారం విడుదల చేసింది. ఈ చిత్రాలు ప్రాజెక్ట్ పురోగతిని, దాని డిజైన్ వివరాలను వెల్లడించాయి. BAS ప్రాజెక్ట్ 2035 నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని ఇస్రో అంచనా వేసింది. ఈ అంతరిక్ష కేంద్రం బహుళ మాడ్యూళ్లతో రూపొందించబడుతుంది. అందులో మొదటి మాడ్యూల్‌ను 2028 నాటికి కక్ష్యలోకి ప్రవేశపెట్టాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. ఈ తొలి మాడ్యూల్ ఆస్ట్రోనాట్స్ నివాసం, ల్యాబ్, పరిశోధనల కోసం అవసరమైన సిస్టమ్ కలిగి ఉంటుంది.
📸 Experience the true size of the Bharatiya Antariksh Station!
— ISRO Spaceflight (@ISROSpaceflight) August 22, 2025
The first-ever 1:1 scale model of the 1st module of BAS is now on display at the Bharat Mandapam in New Delhi! 🔥
This is exactly how big the actual module is going to be! On the bottom picture, you can compare its… pic.twitter.com/8bXoVCgURm
ఇస్రో విడుదల చేసిన ఫొటోలు మాడ్యూల్ మొత్తం డిజైన్‌ను చూపుతున్నాయి. ఇది సుమారు 27 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పుతో ఉండనుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (BAS) మాదిరిగానే, ఈ కేంద్రం భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలో పరిభ్రమిస్తుంది. ఇందులో ఒకేసారి ఇద్దరు నుంచి నలుగురు వ్యోమగాములు ఉండేలా ప్రణాళికలు రూపొందించారు. అత్యవసర సమయాల్లో ఆరుగురి వరకు ఉండటానికి కూడా వీలుంటుందని ఇస్రో పేర్కొంది.
ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకం 'స్పేస్ డాకింగ్'. ఇది అంతరిక్షంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ అంతరిక్ష నౌకలను అనుసంధానించే సాంకేతికత. ఇటీవలే ఇస్రో ఈ డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పరీక్షించింది. ఈ విజయం బీఏఎస్ నిర్మాణానికి ఒక కీలకమైన మైలురాయిగా నిలిచింది.