Jammu and Kashmir Exit Polls :
పదేళ్ళ తర్వాత జమ్మూ–కాశ్మీర్‌లో ఎన్నికలు జరిగాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన ఎన్నికలు కావడంతో వీటికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. మొత్తం 90 స్థానాలకు మూడు విడతల్లో పోలింగ్ నిర్వహించారు. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 46 స్థానాలు అవసరం. 2014లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకీ సరైన మెజారిటీ రాకపోవడంతో బీజేపీ, పీడీపీ ఉమ్మడిగా ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. అయితే ఈ సారి ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి. ఇండియా కూటమిలోని కాంగ్రెస్, ఎన్సీ పొత్తుతో బరిలోకి దిగాయి. మరోవైపు ఎలా అయినా బీజేపీ ఈసారి ఇక్కడ అధికారంలోకి రావాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో విడుదల అయిన ఎగ్జిట్ ఫలితాలు ఆసక్తి రేపుతున్నాయి.
ప్రస్తుతం సర్వే సంస్థలు విడుదల ఏసిన అంచనాల్లో కాంగ్రెస్‌కే ఎక్కువ ఓట్లు వస్తాయని చెబుతున్నా..ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన సీట్లకు కొంచెం అటు ఇటూగా వస్తాయని అంటోంది. దాని ప్రకారం హంగ్ వచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తోంది చెబుతున్నాయి. బీజేపీకి 20 నుంచి 32 అంటోంది.
పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ అంచనా ప్రకారం నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ కూటమి 46-50 స్థానాలు సాధించొచ్చని వేసింది. బీజేపీ..23-27 స్థానాలు; పీడీపీ 7-11 స్థానాలు; ఏఐపీ 0-1, ఇతరులు 4-5 స్థానాలు గెలిచే అవకాశాలున్నట్లు తెలిపింది. కూటమిలో నేషనల్ కాన్ఫరెన్స్ 33-35, కాంగ్రెస్ 13-15 స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెబుతోంది. రిపబ్లిక్ మ్యాట్రిజ్ అయితే పీడీపీ -28, బీజేపీ -25, కాంగ్రెస్ -12, ఎన్సీపీకి - 15, ఇతరులు -7 సీట్లు గెలుచుకుంటారని చెప్పింది. అలాగే దైనిక్ భాస్కర్ ప్రకారం పీడీపీ 4-7, బీజేపీ 20-25, కాంగ్రెస్-ఎన్‌సీ కూటమి- 35-40, ఇతరులు 12-16 గెలవచ్చు. ఇండియాటుడే- సీఓటర్ సర్వేలో నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ కూటమికి 40-48 సీట్లు రావొచ్చని అభిప్రాయపడింది. బీజేపీ 27-32, పీడీపీకి 6-12, ఇతరులకు 6-11 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
యాక్సిస్ మై ఇండియా సర్వే సంస్థ సైతం నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్‌కు 35-45 సీట్లు వస్తాయని చెప్పింది. బీజేపీ 24-34, పీడీపీ 4-6, ఇతరులకు 8-23 సీట్లు రావొచ్చని తెలిపింది. దీని ప్రకారం టఫ్ ఫైట్ ఉండనుందని తెలుస్తోంది.