BJP Winning Effect On Stock Market:
సార్వత్రిక ఎన్నికల టైమ్‌లో ప్రధాని మోదీ ఇండియన్ స్టాక్ మార్కెట్ల మీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూన్ 4న, ఆ తర్వాత సూచీలు అంతకు ముందు రికార్డులను బద్దలు కొడతాయి అని అన్నారు.ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు తమ ప్రభుత్వం గరిష్ట ఆర్థిక సంస్కరణలు, పారిశ్రామికవేత్తలకు అనుకూల విధానాలను అమలు చేసిందని నరేంద్ర మోదీ అన్నారు. మేము వచ్చినపుడు సెన్సెక్స్ 25,000.. ఇప్పుడు సెన్సెక్స్ 75,000 పాయింట్లకు చేరుకుంది. సామాన్యులు స్టాక్ మార్కెట్‌లో ఎంత ఎక్కువ పెట్టుబడి పెడితే ఆర్థిక వ్యవస్థకు అంత మేలు జరుగుతుందని, ప్రతి పౌరునిలో రిస్క్ ఎపిటీషన్ పెరగాలని ప్రధాని అన్నారు. ఈ రోజుల్లో ప్రభుత్వ రంగ షేర్లు కూడా పెరుగుతున్నాయన్నారు.
జూన్ 4 కు ముందు మార్కెట్..
అంతకు ముందు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఇదే విషయాన్ని చెప్పారు. వాళ్ళిద్దరూ అన్నట్టుగానే కేంద్రంలో బీజేపీ గెలిచినప్పుడు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు...తర్వాత 100 రోజుల వరకూ స్టాక్ మార్కెట్లు మంచి ఊపు మీద ఉన్నాయి. ఆల్మోస్ట్ ప్రతీ రోజూ లాభాలను చూశాయి. ఇంకా చెప్పాలంటే మార్కెట్ రికార్డ్ స్థాయిని అందుకుంది. అంతకు ముందు చాలా రోజులు మార్కెట్ చాలా డల్‌గా నడిచింది. దానికి కారణం మూడోసారి బీజేపీకి మెజార్టీ తగ్గుతుందనే ప్రచారం జరగడం. పదేళ్ళుగా ఉన్న ఎన్డీయే గవర్నమెంట్ పడిపోతుందని సర్వేల్లో రావడం..కాంగ్రెస్ అధికారంలోకి రావొచ్చనే సంకేతాలు లాంటివి మార్కెట్ మీద ప్రబావం చూపించాయి. దాంతో గణనీయంగా సూచీలు పడిపోయాయి. అవి దృష్టిలో పెట్టుకునే అమిత్ షా, మోదీలు స్టాక్ మార్కెట్ లాభాల్లోకి వస్తుందని వ్యాఖ్యలు చేశారు.
కరెక్ట్‌గా ఇప్పుడు హర్యానా ఎన్నికల టైమ్‌లో కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. నిన్న హర్యానా, జమ్మూ–కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి. దీనికి ముందు వురుసగా పదిరోజులు స్టాక్ మార్కెట్ డౌన్ ట్రెండ్‌లో నడచాయి. కానీ ఇన్న మాత్రంబొక్కసారి లాభాల్లోకి వచ్చింది. నిన్న ఉదయం నుంచే లాభాల్లో ట్రెడ్ అవుతూ...ఎన్నికలు ఫలితాలు విడుదల అయ్యాక..సూచీలు కూడా లాభాల్లో ముగింపు పలికాయి. కానీ మళ్ళీ ఇవాళ నష్టాలను చవి చూశాయి.
ప్రతిపక్షం ఆరోపణలు..
అయితే ఫలితాల కారణంగానే సూచీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి అని ఎక్కడా ఆధారాలు కనిపించడం లేదు కానీ..వరుసగా బీజేపీ గెలిచినప్పుడు ఇలా లాభాల్లోకి రావడం అనేక ప్రశ్నలకు దారి తీస్తున్నాయి. బీజేపీకి, స్టాక్ మార్కెట్‌కు సంబంధం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీని మీద ప్రతపక్ష పార్టీ కాంగ్రెస్ ఆరోపణలు కూడా చేసింది. స్టాక్ మార్కెట్లను మోదీ, అమిత్ షాలు మానిపులేట్ చేస్తున్నారని రాహుల్ గాంధీ డైరెక్ట్‌గానే విమర్శించారు. ఎన్నికల ఫలితాలకు ముందు మార్కెట్ పతనం అతి పెద్ద కుంభకోణం అని ఆరోపించారు. అమిత్ షా, మోదీ పాత్రలపై దర్యాప్తు చేయించాలని కూడా డిమాండ్ చేశారు. జూన్ 4 తర్వాత రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా నష్టపోగా.. కొందరు ఎంపిక చేసిన వ్యక్తులు మాత్రం లాభపడ్డారని రాహుల్ గాంధీ ఆరోపించారు. మోదీ, షాకు ఈ కుంభకోణంలో ప్రత్యక్ష ప్రమేయం ఉందని ఆరోపించారు.
బలపడుతున్న సందేహాలు..
ఇప్పుడు హర్యానా ఎన్నికల సమయంలో ఇదే సీన్ రిపీట్ అవడంతో ఆనాడు కాంగ్రెస్ చేసిన ఆరోపణలు నిజమేనేమో అన్న సందేహాలు ప్రతిపక్ష నేతలు వ్యక్తం చేస్తున్నారు. స్టాక్ మార్కెట్లను ప్రభుత్వ నేతలు నడిపిస్తున్నారా అనే అనుమానాలు లేవనెత్తుతున్నారు. నేతలు చెప్పినట్టే మార్కెట్ నడుస్తోందా...విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెడుతున్నారా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. దీని వలన కొంతమంది మాత్రం లబ్ధి పొందుతారని కూడా అంటున్నారు. మోదీ, అమిత్ షాలు మదుపర్లకు పెట్టుబడి సలహాలు అందుకే ఇచ్చారా అని అంటున్నారు. స్టాక్ మార్కెట్‌ను నిశితంగా పరిశీలిస్తే ఎంపిక చేసిన వ్యక్తులు మాత్రమే లాభపడుతున్నారో కూడా తెలుస్తుందని చెబుతున్నారు. అయితే వీటికి పటిష్టమైన ఆధారాలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. జూన్ 4 తర్వాత మోదీ, అమిత్ షాలు చెప్పినట్టే జరిగినా..వారే చేశారు అనడానికి ఎక్కడా ప్రూఫ్‌లు మాత్రం లేవు. దీంతో స్టాక్ మార్కెట్ మీద ప్రభుత్వ నేతల పాత్ర అనే విషయం అన్నీ ప్రశ్నలుగానే మిగులుతున్నాయి.
Also Read: Kolkata: కోలకత్తా హత్యాచార ఘటన..వరుసపెట్టి వైద్యుల రాజీనామా