Kolkata: కోలకత్తా హత్యాచార ఘటన..వరుసపెట్టి వైద్యుల రాజీనామా కోలకత్తా ట్రైనీ డాక్టర్ రేప్, హత్య ఘటన ఇన్ని రోజులైనా చల్లారడం లేదు. నిన్నటి వరకూ దీనిపై జూనియర్ వైద్యులు నిరసనలు చేస్తే...ఇప్పుడు సీనియర్ వైద్యులు వరుసపెట్టి రాజీనామాలు చేస్తున్నారు. By Manogna alamuru 09 Oct 2024 in నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Kolkata Doctors: కోలకత్తాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ హత్యాచారం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆగస్టులో జరిగిన ఈ ఘటన మీద ఇప్పటికీ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు నిందితుల మీద సీబీఐ విచారణ చేస్తోంది.మరోవైపు హతురాలు తల్లిదండ్రులకు న్యాయం చేయాలని...తమ డిమాండ్లను నెరవేర్చాలని జూనియర్ వైద్యులు ఆందోళనలు చేస్తున్నారు. మధ్యలో పశ్చిమబెంగాల్ మమతా బెనర్జీ వారి డిమాండ్లను నెరవేర్చుతామని హామీ ఇచ్చారు. దాంతో కొన్ని రోజులు ట్రైనీ డాక్టర్లు నిరసనలు ఆపేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ తమ డిమాండ్లను పట్టించుకోలేదంటూ ఆందోళనలు చేస్తున్నారు. జూనియర్ డాక్టర్ల నిరసనలకు మద్దతుగా తాజాగా సీనియర్ వైద్యులు రాజీనామాలు చేస్తున్నారు. నిన్న 50 మంది రాజీనామాలు చేశారు. ఈరోజు మరో 60 మంది డాక్టర్లు రిజైన్ చేశారు. నిన్న ఆర్జీకర్ ఆసుపత్రికి చెందిన వైద్యుల మకుమ్మడి రాజీనామా వీడియో సోషల్ మీడియాలో వైరల్ కూడా అయింది. ప్రస్తుతానికి రెండు ప్రముఖ వైద్య కళాశాలల్లో మూకుమ్మడి రాజీనామాలు చోటు చేసకున్నాయి. Also Read: Business: ఒక్కరోజు ఆనందమే..తిరిగి నష్టాల్లోకి స్టాక్ మార్కెట్ మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి