/rtv/media/media_files/2026/02/09/irctc-2026-02-09-21-23-05.jpg)
రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒక తీపి కబురు అందించింది. ప్రయాణంలో నాణ్యమైన ఆహారం కోసం ఇబ్బంది పడే అవసరం లేకుండా, తాజాగా 'E-Pantry' (ఈ-పాంట్రీ) సేవలను ప్రారంభించింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుతం 25 రైళ్లలో ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.
సాధారణంగా రైలులో ఉండే పాంట్రీ కార్ ఆహారంపై చాలా మందికి ఫిర్యాదులు ఉంటాయి. దీనికి పరిష్కారంగా, ఐఆర్‌సీటీసీ ప్రముఖ రెస్టారెంట్లు, ఫుడ్ చెయిన్లతో జతకట్టింది. ఈ-పాంట్రీ ద్వారా మీకు నచ్చిన బ్రాండెడ్ ఫుడ్ (పిజ్జా, బిర్యానీ, వెజ్ థాలీ వంటివి) నేరుగా మీ సీటు వద్దకే వస్తుంది.
బుక్ చేసుకోవడం ఎలా?
ముందుగా ఐఆర్‌సీటీసీ అధికారిక ఈ-కేటరింగ్ వెబ్‌సైట్ (www.ecatering.irctc.co.in) సందర్శించండి లేదా 'Food on Track' యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
మీ టికెట్‌పై ఉన్న 10 అంకెల PNR నంబర్‌ను ఎంటర్ చేయండి.
మీకు నచ్చిన వంటకాలను సెలెక్ట్ చేసుకుని కార్ట్‌కు యాడ్ చేయండి
మీరు ఆన్‌లైన్‌లో పేమెంట్ చేయవచ్చు లేదా Cash on Delivery ద్వారా డబ్బులు చెల్లించవచ్చు.
రైలు సంబంధిత స్టేషన్‌కు చేరుకోగానే, డెలివరీ బాయ్ మీ కోచ్, సీటు నంబర్ వెతుక్కుంటూ వచ్చి ఆహారాన్ని అందిస్తారు.
మెనూలో ఉన్న ధరలకే ఆహారం లభిస్తుంది, అదనపు వసూళ్లు ఉండవు. ఆర్డర్ బుక్ అయిన తర్వాత మీ మొబైల్‌కు ఓటిపి, ఇతర వివరాలు వస్తాయి. ఒకవేళ ప్రయాణం రద్దయితే, నిర్ణీత సమయం కంటే ముందే ఆహారాన్ని కూడా రద్దు చేసుకోవచ్చు.
Follow Us