Bengaluru BA college : ఇన్‌స్టాగ్రామ్ పరిచయమైన యువతిని పార్టీకి పిలిచి..

ఇన్‌స్టాగ్రామ్ లో పరిచయమైన యువతిని పార్టీకి పిలిచి అత్యాచారం చేసిన ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. సోషల్‌ మీడియా పరిచయాన్ని ఆసరాగా చేసుకుని ఓ యువకుడితో పాటు అతడి స్నేహితుడు తనపై లైంగిక దాడి చేశారని ఓ యువతి పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగు చూసింది.

New Update
rape  woman

Rape of a young woman

Bengaluru BA college :  ఇన్‌స్టాగ్రామ్ లో పరిచయమైన యువతిని పార్టీకి పిలిచి అత్యాచారం చేసిన ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. సోషల్‌ మీడియా పరిచయాన్ని ఆసరాగా చేసుకుని ఓ యువకుడితో పాటు అతడి స్నేహితుడు తనపై లైంగిక దాడి చేశారని ఓ యువతి పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగు చూసింది. అయితే యువతి ఫిర్యాదు చేయడానికి ముందే యువకులు కూడా ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..తమిళనాడులోని తిరుపూర్‌కు చెందిన 19 ఏళ్ల యువతి.. డిగ్రీ చదవడం కోసం  5 నెలల క్రితం బెంగళూరుకు వచ్చింది. ఓ ప్రైవేట్ కాలేజీలో బీఏ ఫస్ట్ ఇయర్ చదువుతూ స్థానికంగా హాస్టల్‌లో ఉంటుంది. ఇదిలా ఉండగా ఆ యువతికి ఈ ఏడాది జనవరిలో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బెంగళూరుకు చెందిన 21 ఏళ్ల డిక్సన్ శాండో అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారగా వారిద్దరూ 
ఇన్‌స్ట్రాలో చాటింగ్‌ చేసుకోవడంతో పాటు కొన్నిసార్లు బయట నేరుగా కలుసుకునేవారు.  

ఈ క్రమంలో ఫిబ్రవరి 14వ తేదీన డిక్సన్  ఆ యువతికి ఫోన్‌ చేశాడు.  ఫిబ్రవరి 15వ తేదీన ఒక పార్టీ ఏర్పాటు చేసినట్లు దానికి  రావాలని ఆమెను ఆహ్వానించాడు. స్నేహితుని ఆహ్వానం మేరకు 15న  ఆ యువతి తన స్నేహితురాలితో కలిసి పార్టీకి వెళ్లింది. పార్టీ సందర్భంగా డిక్సన్, అతడి స్నేహితుడు నిఖిల్ బలవంతంగా యువతికి ఒక పింక్ కలర్ ట్యాబ్లెట్ ఇచ్చి తినమన్నారు. ఆ టాబ్లెట్‌ తిన్న ఆమె మైకంలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆ యువకులిద్దరూ ఆమెపై అత్యాచారం చేశారు. మెలకువ వచ్చిన తర్వాత తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని గుర్తించిన యువతి వారిని నిలదీసింది. అయితే ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తామని బెదిరించారు. అయితే, యువతి ధైర్యం చేసి ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది.పార్టీ పేరుతో తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. తనకు గుర్తు తెలియని టాబ్లెట్‌ ఇచ్చి అత్యాచారం చేశారని సదరు యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.  

యువకుల ట్విస్ట్‌

అయితే ఇక్కడ పోలీసులకు యువకుల ట్విస్ట్‌ ఇచ్చారు. యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఒక రోజు ముందే నిందితులిద్దరూ యువతిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. సంఘటన ఫిబ్రవరి 15న జరగగా ఫిబ్రవరి 21న యువతిపై యవకులు కంప్లైంట్ ఇచ్చారు. సదరు యువతి ఇమ్రాన్ అనే వ్యక్తితో కలిసి తమపై బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతోందని, తనపై అత్యాచారం చేశారని డబ్బులు డిమాండ్ చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే తనపై అత్యాచారం జరిగిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఆలస్యంగా ఫిర్యాదు చేయటంపై యువతి స్పందించింది. ‘ఫిబ్రవరి 17వ తేదీన బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాను. తర్వాత నా సోదరుడికి ఈ విషయం చెప్పాను. అతడు పోలీసులకు ఫిర్యాదు చేయమని సలహా ఇచ్చాడు’ ఆయన సూచన మేరకు ఫిర్యాదు చేశానని వెల్లడించింది. కాగా ఈ కేసులో నిజానిజాలను వెలికి తీయడానికి పోలీసులు కసరత్తు చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు