Train toilet update: రైల్వేశాఖ సంచలన నిర్ణయం.. టాయిలెట్లలో ఆ సమస్యకు చెక్

దేశవ్యాప్తంగా అత్యధిక మంది ప్రజలు రైల్వే ప్రయాణాన్ని ఎంతో ఇష్టడుతుంటారు. సేఫ్ జర్నీ, వేగవంతమైన & సౌకర్యవంతమైన ప్రయాణం ఇందుకు కారణం. అయితే కొన్ని ట్రైన్లలో అన్నీ బాగున్నా టాయిలెట్ రూమ్స్ మాత్రం అత్యంత దారుణంగా ఉంటాయి.

New Update
Train toilet update

Train toilet update

దేశవ్యాప్తంగా అత్యధిక మంది ప్రజలు రైల్వే ప్రయాణాన్ని ఎంతో ఇష్టడుతుంటారు. సేఫ్ జర్నీ, వేగవంతమైన & సౌకర్యవంతమైన ప్రయాణం ఇందుకు కారణం. అయితే కొన్ని ట్రైన్లలో అన్నీ బాగున్నా టాయిలెట్స్ మాత్రం అత్యంత దారుణంగా ఉంటాయి. లోపల మొత్తం వాటర్‌‌తో నిండి ఉంటుంది. అయితే దీనికి కారణం బాత్రూంలో గొలుసుతో కట్టిన స్టీల్ మగ్‌ అని రైల్వే శాఖ గుర్తించింది. రైళ్లు అధిక వేగంతో కదులుతున్న సమయంలో మగ్గులను నింపేటప్పుడు చాలా నీరు నేలపైకి పడుతుంది. 

దీనివల్ల టాయిలెట్ ఫ్లోర్ తడిసి రైలు అంతటా ధూళి వ్యాపిస్తుంది. కాలక్రమేణా ఫ్లోర్ మొత్తం పాడవుతుంది. చాలా రైలులో దుర్వాసన కూడా వస్తుంది. ఇలా మురికి వాష్‌రూమ్‌ల గురించి ప్రయాణీకులు తరచూ రైల్వే శాఖకు ఫిర్యాదు చేస్తునేఉన్నారు. ఇన్నాళ్లకు వాళ్ల ఫిర్యాదుల ప్రయత్నం ఫలించింది. 

రైల్వే శాఖ కీలక నిర్ణయం

ప్రయాణికుల సౌకర్యం, పరిశుభ్రత దిశగా భారతీయ రైల్వే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నో ఏళ్లుగా రైలు టాయిలెట్లలో కనిపిస్తున్న గొలుసుతో కట్టిన స్టీల్ మగ్గులను తొలగించాలని నిర్ణయించుకుంది. అది మాత్రమే కాకుండా వాటి స్థానంలో ఆధునిక ‘జెట్ స్ప్రే’లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు రైల్వే శాఖ తాజాగా తెలిపింది. ఈ కొత్త వ్యవస్థను అమలు చేయడానికి ముందు రైల్వే మంత్రిత్వ శాఖ ఉత్తర రైల్వేలో ట్రయల్స్ ప్రారంభించింది.

image - 2026-02-19T150533.230

ట్రైయల్ షురూ

ఢిల్లీ, అంబాలా డివిజన్‌లు శతాబ్ది ఎక్స్‌ప్రెస్ కోచ్‌లలో ముందుగా ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించాయి. వాష్‌రూమ్‌లో నేల దగ్గర ఉండే కుళాయి & మగ్గులను తొలగించి జెట్ స్ప్రేలను అమర్చారు. ఈ మార్పు వల్ల ట్రయల్ సమయంలో టాయిలెట్ ఫ్లోర్ మునుపటి కంటే పొడిగా, శుభ్రంగా ఉందని గుర్తించారు. 

ప్రస్తుతం ఎంపిక చేసిన 10 రైళ్లలోని AC కోచ్‌లలో దీనిని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. ఇలా దాదాపు మూడు నెలల తర్వాత ప్రయాణికుల రెస్పాన్స్ చూసి మిగతా రైళ్లకు విస్తరించనున్నారు. ఇప్పటికే 182 శతాబ్ది కోచ్‌లలో జెట్ స్ప్రేలను ఏర్పాటు చేశారు. ఈ కొత్త వ్యవస్థ వల్ల రైలు ప్రయాణం మరింత శుభ్రంగా, సౌకర్యవంతంగా మారనుంది.

Advertisment
తాజా కథనాలు