Ceasefire : కాల్పుల విరమణ అంటే ఏమిటి.. ఇక యుద్ధం ఉండదా?

కాల్పుల విరమణ అంటే ఇన్ని రోజులు జరిగిన సంఘర్షణ ఒక ముగింపు అన్నమాట. ఇది ఒక రకమైన రాజీ అని అర్థం.  రెండు దేశాల మధ్య తాత్కాలికంగా శాంతిని పునరుద్ధరించడం అవుతుంది.  కాల్పుల విరమణ అనేది ఒక సైనిక ఒప్పందం కూడా.

New Update
india-pak-war

india-pak-war

భారత్, పాకిస్తాన్‌ దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ సెక్రటరీ విక్రమ్ మిస్రీ వెల్లడించారు. ఈ కాల్పుల విరమణ ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు.  ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పాక్ DGMO కి ఫోన్ చేసి ఇండియన్ ఆర్మీతో  మాట్లాడినట్లుగా వెల్లడించారు. మరోవైపు మే 12వ తేదీన పాక్ తో శాంతి చర్చలు జరుపుతామని విక్రమ్ మిస్రీ తెలిపారు. అమెరికా మధ్యవర్తిత్వంతోనే ఈ కాల్పుల విరమణ జరిగింది. ఇరు దేశాల మధ్య సుదీర్ఘమైన చర్చల తర్వాత.. భారత్, పాకిస్తాన్ దేశాలు కాల్పుల విరమణకు తక్షణమే ఒప్పందం చేసుకున్నాయని ట్రంప్ తన ట్వీట్ లో వెల్లడించారు. 

 కాల్పుల విరమణ అంటే

ఇంతకీ కాల్పుల విరమణ అంటే ఏమిటో  తెలుసుకుందాం. కాల్పుల విరమణ అంటే ఇన్ని రోజులు జరిగిన సంఘర్షణ ఒక ముగింపు అన్నమాట. ఇది ఒక రకమైన రాజీ అని అర్థం.  రెండు దేశాల మధ్య తాత్కాలికంగా శాంతిని పునరుద్ధరించడం అవుతుంది.  కాల్పుల విరమణ అనేది ఒక సైనిక ఒప్పందం కూడా. అంతేకాకుండా చర్చలకు అనుకూలమైన వాతావరణాన్ని కూడా సృష్టిస్తుంది.  చాలా సార్లు శత్రు దేశాల మధ్య చర్చలు, ఒప్పందానికి వాతావరణాన్ని సృష్టించడానికి రెండు దేశాల సమ్మతితో కూడా దీనిని అమలు చేస్తారు. మూడవ దేశం జోక్యంతో కాల్పుల విరమణ ప్రకటించవచ్చు, తద్వారా శాశ్వత శాంతిని పునరుద్ధరించడానికి చర్చలకు వాతావరణం ఏర్పడుతుంది కాల్పుల విరమణకు సంబంధించిన ఏ రూల్స్ ను ఎవరు బ్రేక్ చేసిన మరో దేశం యుద్ధాన్ని కొనసాగించవచ్చు.  

Advertisment
తాజా కథనాలు