Parliament: పార్లమెంటు వద్ద హై టెన్షన్.. రాహుల్ గాంధీ అరెస్టు

పార్లమెంటు వద్ద టెన్షన్ వాతారవరణం నెలకొంది. బిహార్‌లో చేపట్టిన ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ(SIR)కు నిరసనగా ఇండియా కూటమి ఎంపీలు ర్యాలీ నిర్వహించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

New Update

పార్లమెంటు వద్ద టెన్షన్ వాతారవరణం నెలకొంది. బిహార్‌లో చేపట్టిన ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ(SIR)కు నిరసనగా ఇండియా కూటమి ఎంపీలు ర్యాలీ నిర్వహించారు. పార్లమెంటు నుంచి కేంద్ర ఎన్నికల సంఘం వరకు ర్యాలీకి బయలుదేరారు. కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత రాగుల్ గాంధీ నేతృత్వంలో ఈ ర్యాలీ జరిగింది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగినట్లు నినాదాలు చేస్తున్నారు. మరోవైపు ఇండియా కూటమి ఎంపీ ర్యాలీకి పర్మిషన్ లేదని పోలీసులు చెబుతున్నారు. 

మొత్తం 300 మంది ఎంపీలతో ఇండియా కూటమి ర్యాలీ చేస్తోంది. దీంతో పార్లమెంటు బయటే పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. సంసద్‌ మార్గ్‌లో భారీగా మోహరించారు. పలువురు ఎంపీలు బారికేడ్లపైకి కూడా ఎక్కారు. దీంతో రాహుల్‌ గాంధీతో పాటు విపక్ష ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని బస్సుల్లో వేరే చోటుకి తరలిస్తున్నారు. ఓట్ల చోరీపై రాహుల్‌ గాంధీ ఎన్నికల సంఘంపై తీవ్రంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో విపక్ష నేతలు ఎన్నికల సంఘం అపాయిట్‌మెంట్‌ కోరారు. మధ్యాహ్నం 12 గంటలకు ఈసీ అపాయింట్‌మెంట్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే కేవలం 30 మంది మాత్రమే రావాలని ఈసీ.. కాంగ్రెస్ నేత జైరాం రమేష్‌కు లేఖ రాసింది.  

Advertisment
తాజా కథనాలు