Indo-Ghina Disengagement:
తూర్పు లద్ధాఖ్‌లోని డెప్సాంగ్, డెమ్చోక్ ప్రాంతాల్లో భారత్, చైనా బలగాల ఉపసంహరణ ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చింది. ఒప్పందంలో భాగంగా కీలక ప్రాంతాల నుంచి ఇరుదేశాల సైనికులు తమ మౌలిక సదుపాయాలను, ఇతర సామగ్రిని వెనక్కి తీసుకున్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. గస్తీ ఒప్పందం ప్రకారం అక్టోబర్ 29లోగా బలగాలను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారు. బోర్డర్ లైన్ దగ్గర ఇన్నాళ్ళుగా ఉన్న ఉద్రిక్తతలకు స్వస్తి పలకాలన్న నిర్ణయానికి ఇరు దేశాధినేతలు రీసెంట్‌గా వచ్చారు. దీంతో 2020 నాటి స్థితికి ఎల్‌ఏసీ ఇక కొనసాగనుంది. ఇరు దేశాల సైనికులు 2020 గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్ పాయింట్లకు స్వేచ్ఛగా వెళ్ళవచ్చును.
2020 జూన్ 15న తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఘర్షణలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. చైనా కూడా భారీగా సైనికులను కోల్పోయింది. దీంతో రెండు దేశాలు గస్తీ వెంబడి భారీగా బలగాలను మోహరించాయి. అప్పటి నుంచి అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Also Read: EC:హరియాణా ఎన్నికలు..కాంగ్రెస్ ఆరోపణలు నిజం కావు–ఈసీ