Hindu professor : ఉగ్రదాడి నుంచి తప్పించుకున్న హిందూ ప్రొఫెసర్.. ఉగ్రవాదులకు ఏం చెప్పాడంటే?

ఉగ్రవాద దాడిలో ఓ హిందూ ప్రొఫెసర్ తన ప్రాణాలను కాపాడుకున్నాడు. అతను ఉగ్రవాదులను చూసిన వెంటనే కల్మా అనే ఇస్లామిక్ శ్లోకాన్ని పఠించడం ప్రారంభించాడు. దీంతో కృతజ్ఞతగా ఉగ్రవాదులు తమ మనసు మార్చుకుని అతన్ని చంపకుండా వదిలేశారు.

New Update


జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో నిన్న టూరిస్టులపై జరిగిన ఉగ్రవాద దాడిలో హిందూ ప్రొఫెసర్ తన ప్రాణాలను కాపాడుకున్నాడు. అతను ఉగ్రవాదులను చూసిన వెంటనే కల్మా అనే ఇస్లామిక్ శ్లోకాన్ని పఠించడం ప్రారంభించాడు. దీంతో కృతజ్ఞతగా ఉగ్రవాదులు తమ మనసు మార్చుకుని అతన్ని చంపకుండా వదిలేశారు. అస్సాం విశ్వవిద్యాలయంలోని బెంగాలీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ దేబాశిష్ భట్టాచార్య ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ..  ఉగ్రవాద దాడి నుంచి తప్పించుకున్న విషయాలను ఆయన వెల్లడించారు.  

ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను

నేను నా కుటుంబంతో కలిసి ఒక చెట్టు కింద నిద్రిస్తున్నాను. అప్పుడు అకస్మాత్తుగా నా చుట్టూ జనాలు గుసగుసలాడుకోవడం విన్నాను. వారు కల్మా పారాయణం చేస్తున్నారు. నేను కూడా దాన్ని చదవడం ప్రారంభించాను. కొన్ని క్షణాల్లోనే యూనిఫాంలో ఉన్న ఉగ్రవాదులు అక్కడికి చేరుకున్నారు. వాళ్ళలో ఒకడు మా వైపు వచ్చి నా పక్కన పడుకున్న వ్యక్తి తలపై కాల్చాడు.  దీని తర్వాత ఆ ముష్కరుడు నా వైపు తిరిగాడు.  నా వైపు సూటిగా చూసి, నువ్వు ఏం చేస్తున్నావు? అని అడిగాడు. నేను కల్మాను మరింత బిగ్గరగా చదవడం ప్రారంభించాను. దీంతో అతను నా దగ్గరినుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన అనంతరం తాను తన కుటుంబంతో కలిసి ఒక గుర్రపు స్వారీ బండిలో అక్కడినుండి పారిపోయానని తెలిపాడు. దీనికి రెండు గంటల సమయం పట్టిందన్నాడు.  నేను బతికే ఉన్నానని అంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను' అని భట్టాచార్య అన్నారు. ఇప్పుడు తన కుటుంబం శ్రీనగర్‌లో ఉందని వీలైనంత త్వరగా ఇంటికి తిరిగి వెళ్లడానికి సిద్ధమవుతున్నామని వెల్లడించాడు. 

పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రవాద దాడిలో కనీసం 27 మంది పర్యాటకులు మరణించారు . మంగళవారం ఉదయం పర్యాటకుల విహారయాత్రకు వెళ్లిన బైసారన్‌లో ఈ దాడి జరిగింది. పాకిస్తాన్‌కు చెందిన నిషేధిత లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) ఉగ్రవాద సంస్థ రెసిస్టెన్స్ ఫ్రంట్‌కు చెందిన షాడో గ్రూప్ ఈ దాడికి బాధ్యత వహించింది. ఇస్లాంలో 'కల్మా' అనేది విశ్వాస ప్రకటన. దేవుని పట్ల విధేయత. దీనిని పఠించలేని వారిని ముస్లిమేతరులుగా పరిగణించి కాల్చి చంపారు. అదేవిధంగా సున్నతి ముస్లింలలో ఒక సాధారణ ఆచారం. సున్నతి చేయించుకోని వారిని ముస్లిమేతరులుగా భావించి కాల్చి చంపేవారు.

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు