రియల్‌ ఎస్టేట్‌కు షాక్.. హైదరాబాద్‌లో తగ్గిపోతున్న ఇళ్ల అమ్మకాలు !

హైదరాబాద్‌లోని రియల్‌ ఎస్టేట్‌కు సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ ఏడాది జులై- సెప్టెంబర్‌ మధ్య కాలంలో ఇళ్ల విక్రయాలు దాదాపు 42 శాతం తక్కువగా నమోదవుతాయని రియల్‌ ఎస్టేట్ అనలైటిక్‌ సంస్థ అయిన ప్రాప్‌ ఈక్విటీ అంచనా వేసింది. 12,082 యూనిట్ల విక్రయాలు ఉండొచ్చని చెప్పింది.

Real Estate 2
New Update

హైదరాబాద్‌లోని రియల్‌ ఎస్టేట్‌కు సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ ఏడాది జులై- సెప్టెంబర్‌ మధ్య కాలంలో ఇళ్ల విక్రయాలు దాదాపు 42 శాతం తక్కువగా నమోదవుతాయని రియల్‌ ఎస్టేట్ అనలైటిక్‌ సంస్థ అయిన ప్రాప్‌ ఈక్విటీ అంచనా వేసింది.  12,082 యూనిట్ల విక్రయాలు ఉండొచ్చని చెప్పింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసిక కాలంలో విక్రయాలు 20,658 యూనిట్లుగా ఉన్నట్లు తన నివేదికలో వెల్లడించింది. ఇక దేశవ్యాప్తంగా తొమ్మిది ప్రధాన పట్టణాల్లో సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు మొత్తం మీద 18 శాతం తగ్గి 1,04,393 యూనిట్లుగా ఉండొచ్చని పేర్కొంది. గత ఏడాది ఇదే కాలంలో 1,26,848 యూనిట్లుగా ఉన్నట్లు తెలిపింది. 

Also Read: జెఎన్‌టీయూహెచ్‌లో మారనున్న సిలబస్‌.. వచ్చే విద్యా సంవత్సరం అమలు

తొమ్మిది పట్టణాలకు గాను ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో 22 శాతం, నవీ ముంబైలో ఇళ్ల అమ్మకాల్లో 4 శాతం చొప్పున మాత్రమే వృద్ధి ఉంటందని చెప్పింది. ఇక మిగిలిన అన్ని పట్టణాల్లో ఇళ్ల విక్రయాల వృద్ధి క్షీణించవచ్చొని పేర్కొంది.  ప్రాప్‌ ఈక్విటీ అంచనా ప్రకారం పట్టణాల వారీగా ఇచ్చిన వివరాలు ఇప్పడు తెలుసుకుందాం.    

1.బెంగళూరులో ఇళ్ల విక్రయాలు జులై - సెప్టెంబర్‌ మధ్యకాలంలో 26 శాతం క్షీణించి 13, 355 యూనిట్లుగా ఉంటాయి. గత ఏడాది ఇదే కాలంలో 17,978 యూనిట్ల అమ్మకాలు జరిగాయి
2. చెన్నై మార్కెట్‌లో 18 శాతం క్షీణించి 4,634 యూనిట్ల విక్రయాలు జరిగే అవకాశం ఉంది. 
3. కోల్‌కతాలోలో 23 శాతం క్షీణించి 3,590 యూనిట్లు అమ్ముడుపోవచ్చు.
4. పూణెలో 19 శాతం క్షీణించి 21,36 యూనిట్ల అమ్మకం జరిగే ఛాన్స్ ఉంది.
5. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌ (MMR)లో ఇళ్ల విక్రయాలు 10 శాతం తగ్గి 20, 460 యూనిట్లుగా ఉండే అవకాశం ఉంది. గత ఏడాది ఇదే కాలంలో 22,802 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. 
6. ముంబైలో 17 శాతం క్షీణించి 10,966 యూనిట్లు ఇళ్ల విక్రయాలు నమోదవ్వొచ్చు. నవీ ముంబైలో మత్రం 4 శాతం అధికంగా అంటే 7,737 యూనిట్ల విక్రయాలు జరిగే ఛాన్స్ ఉంది. 
7. ఢిల్లీ ఎన్‌సీఆర్‌ మార్కెట్‌లో 22 శాతం వృద్ధితో 10,263 యూనిట్ల ఇళ్ల విక్రయాలు నమోదవుతాయి. 

రియల్‌ ఎస్టేట్ రంగంలో ప్రస్తుతం దీనికి డిమాండ్ బలంగానే ఉంది. ప్రస్తుత త్రైమాసికంలో కొత్త ఆవిష్కరణల కంటే విక్రయాలే ఎక్కువగా ఉన్నాయి. విక్రయాల్లో స్వల్ప క్షీణత అన్నది ప్రతికూల పరిస్థితులకు సూచిక కాదని ప్రాప్ ఈక్విటీ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ జసూజ పేర్కొన్నారు. 

Also Read: అద్దె ఇంట్లో వ్యభిచారం.. దంపతులు అరెస్ట్!

ఇదిలాఉండగా హైదరాబాద్‌లో జులై- సెప్టెంబర్‌ మధ్య కాలంలో ఇళ్ల విక్రయాలు దాదాపు 42 శాతం క్షీణించింది. ఇంతలా తగ్గిపోవడానికి హైడ్రా కూడా ఒక కారణమేనని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం నగర ప్రాంగణంలో చెరువుల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లలో ఉన్న నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఇళ్లు కొనుక్కోవాలనుకునేవారు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అందుకే ఇళ్ల విక్రయాల మార్కెట్‌ చాలావరకు తగ్గిపోయింది. మరోవైపు నగరంలో భారీ వర్షం పడితే ఇళ్లు నీటమునుగుతున్నాయి. ఈ అంశాలను కూడా వినియోగదారులు పరిగణలోకి తీసుకుంటున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ మార్కెట్‌ ఎలా పుంజుకుంటుందో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. 

 

#telugu-news #real-estate-business #real-estate
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి