/rtv/media/media_files/2025/04/23/uACOpx3R3RSJfo0IsDue.jpg)
modi-amit-shah
28 మందిని బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడికి సంబంధించి న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్, భారత జాతీయ భద్రతా సలహాదారు దోవల్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై మోదీ వారితో చర్చిస్తున్నారు.
Delhi | Prime Minister Narendra Modi chairs meeting of Cabinet Committee on Security (CCS).
— ANI (@ANI) April 23, 2025
Union HM Amit Shah, Defence Minister Rajnath Singh, EAM Dr S Jaishankar and others officials are present. pic.twitter.com/zXv9TohVz3
అంతకుముందు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మృతుల కుటుంబాలను, గాయపడిన వారిని కలిసి పరామర్శించారు. కాగా మృతుల కుటుంబాలకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.1 లక్ష చొప్పున నష్టపరిహారం ప్రకటించింది.
ప్రపంచం ఆశ్చర్యపోయేలా జవాబు ఇస్తాం
భారత్ ను ఎవరూ భయపెట్టలేరని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. త్రివిధ దళాధిపతులతో భేటీ అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచం ఆశ్చర్యపోయేలా జవాబు ఇస్తామని అన్నారు. పహల్గాం దాడికి అతి త్వరలో ప్రతీకారం తీర్చుకుంటామని.. ఒక్క దోషిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదన్నారు. ఎక్కడ నక్కిన కూడా పట్టుకుంటామని హామీ ఇచ్చారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించాలనేదే భారత్ నినాదమని తెలిపారు. ఉగ్రవాదులు పిరికిపంద చర్యకు పాల్పడ్డారన్న రాజ్ నాథ్ సింగ్... ఈ చర్యకు పాల్పడిన వారిని మాత్రమే కాకుండా, తెరవెనుక ఉన్న వారిని కూడా వదిలిపెట్టబోమన్నారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేశారు రాజ్ నాథ్ సింగ్.
Also Read : Taliban Government : పహల్గాంలో ఉగ్రదాడి.. తాలిబన్ల సంచలన ప్రకటన!