ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా సోరెన్ ప్రమాణ స్వీకారం

ఝార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన ఝార్ఖండ్‌కి నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు. రాంచీలోని మొరాబాది స్టేడియంలో గవర్నర్‌ సంతోష్‌ కుమార్‌ గాంగ్వార్‌.. హేమంత్ సోరెన్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు.

New Update

ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. నాలుగోసారి హేమంత్ సోరెన్ ఝార్ఖండ్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. జేఎంఎం పార్టీ నుంచి హేమంత్ సోరెన్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచి రాంచీలోని మొరాబాది స్టేడియంలో రాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నాలుగోసారి హేమంత్ సోరెన్ ఝార్ఖండ్‌కి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 

ఇది కూడా చూడండి: IPL-2025: ఫ్రాంఛైజీలు కొనుగోలు, రీటైన్ చేసుకున్న ఆటగాళ్ళ లిస్ట్ ఇదే..

సోరెన్ ప్రమాణ స్వీకారానికి ఇండియా కూటమి నేతలు..

 గవర్నర్‌ సంతోష్‌ కుమార్‌ గాంగ్వార్‌, హేమంత్ సోరెన్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం నేతృత్వంలో ఇండియా కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఇండియా కూటమి నేతలు శరద్‌ పవార్‌, మల్లికార్జున ఖర్గే, మమతా బెనర్జీ, అఖిలేష్‌ యాదవ్‌, రాహుల్‌ గాంధీ హాజరయ్యారు. 

ఇది కూడా చూడండి: ఊహించని రేంజ్‌లో ఐపీఎల్ బిజినెస్.. మూడు రెట్లు పెరిగిన పెట్టుబడి!

వీరితో పాటు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌, ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌, ఆయన భార్య సునితా కేజ్రీవాల్‌, ఎంపీ రాఘవ్‌ చద్ధా తదితరులు కూడా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. 

ఇది కూడా చూడండి: Rishab pant: ఢిల్లీని వీడటంపై పంత్‌ ఎమోషనల్‌.. మరీ ఇంత ప్రేమనా!

ఝార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 81 స్థానాలు ఉన్నాయి. ఇందులో జేఎంఎం కూటమి 56, ఎన్‌డీఏ 24 సీట్లు పొందాయి. ఇటీవల జరిగిన ఈ ఎన్నికల్లో హేమంత్‌ సోరెన్‌తో పాటు ఆయన భార్య కల్పన సోరెన్ కూడా విజయం సాధించారు.

ఇది కూడా చూడండి: 16 ఏళ్ల తర్వాత కానిస్టేబుల్ కుటుంబానికి సుప్రీంకోర్టులో న్యాయం..

Advertisment
Advertisment
తాజా కథనాలు